Telugu Movies Releasing this Week: ఈ వారం విడుదలవుతున్న తెలుగు సినిమాల లిస్ట్‌!

Telugu Movies in Theaters This Week : కరోనా కేసులు తగ్గడంలో మళ్లీ థియేటర్లలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వారం రిలీజ్‌ అయ్యే సినిమా లిస్ట్ చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 10:39 PM IST
  • ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పలు ఖిలాడీ, (Khiladi) డీజే టిల్లుతో (DJ Tillu) పాటు పలు తెలుగు సినిమాలు (Telugu Movies) రిలీజ్ కానున్నాయి. ఈ వారం సినిమాల లిస్ట్ (Cinemas List).
Telugu Movies Releasing this Week: ఈ వారం విడుదలవుతున్న తెలుగు సినిమాల లిస్ట్‌!

Theater releasing Telugu Movies: కొవిడ్ థర్డ్‌ వేవ్‌తో కాస్త నెమ్మదించిన తెలుగు సినిమాల రిలీజ్‌లు.. ఇప్పుడు మళ్లీ జోరును పెంచుకున్నాయి. మళ్లీ క్రమంగా మూవీలు నేరుగా థియేటర్‌‌లలో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం పలు మూవీలు డైరెక్ట్‌గా థియేటర్‌‌లలో రిలీజ్‌ కానున్నాయి. ఆ మూవీలపై ఓ లుక్కేయండి మరి.

రవితేజ "ఖిలాడీ"

హీరో రవితేజ తాజా చిత్రం ఖిలాడి. ఈ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ శుక్రవారం రిలీజ్‌ కానుంది. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ, అర్జున్‌ కీ రోల్స్ ప్లే చేశారు. రవితేజ ఈ మూవీలో డబుల్‌ రోల్‌ ప్లే చేశాడు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు.

విష్ణు విశాల్‌.. "ఎఫ్‌ఐఆర్‌"

విష్ణు విశాల్‌ హీరోగా నటిస్తూ... ఆయనే స్వయంగా నిర్మించిన మూవీ "ఎఫ్‌ఐఆర్‌". మను ఆనంద్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీని హీరో రవితేజ సమర్పిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ మూవీ ఫిబ్రవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. టెర్రిరిజం బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. 

మూన్‌ ఫాల్‌

రోలాండ్ ఎమ్మెరిచ్ దర్శకత్వం వహించి.. నిర్మించిన సైన్స్ ఫిక్షన్ మూవీ మూన్‌ ఫాల్‌. ఈ సినిమాలో హాలీ బెర్రీ, జాన్ బ్రాడ్లీ, పాట్రిక్ విల్సన్, మైఖేల్ పెనా, చార్లీ ప్లమ్మర్ నటించారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ సినిమా ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది.

Also Read: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాళ్లు.. కొంపదీసి స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా ఏంది?

Also Read: Viral Video: సీఎం యోగి వేషధారణలో పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News