Vikkatakavi Streaming on Zee5: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వికటకవి అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్.. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మీడియాతో పంచుకున్నారు కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల గాయ‌త్రి దేవి. తాను పుట్టింది విజ‌య‌న‌గ‌రంలో అని.. పెరిగిందంతా చెన్నైలో అని చెప్పారు. ఇంట‌ర్ వ‌ర‌కు చెన్నైలోనే చ‌దువుకున్నాను. కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశానని తెలిపారు. తాను మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగానికి రిజైన్ చేసిన తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాయని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Fake 500 Rupee Note: రూ.500 నోటు ఉందా? ఇప్పుడే ఇలా చెక్‌ చేసుకోండి.. లేదంటే!  


"నేను పలాస సినిమాకు డిజైనింగ్ చేసిచ్చాను. ఆ తరువాత కుడిఎడమైతే అనే వెబ్ సిరీస్‌తో కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా కెరీర్ మొదలైంది. పారాహుషార్ అనే సినిమాక పనిచేశా. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా రిలీజ్ కాలేదు. సర్వం శక్తిమయం అనే వెబ్‌ సిరీస్‌కు పనిచేయడంతో కాస్ట్యూమ్ డిజైనింగ్‌ మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యాన‌ర్ సంస్థ నిర్మించిన సిరీస్ హ‌రిక‌థ‌కు పనిచేశాను. ఆ వెబ్ సిరీస్‌ డిసెంబర్‌లో విడుదల అవుతుంది. దీంతో పాటు విక‌ట‌క‌వి వెబ్‌ సిరీస్‌కు కూడా ఒకేసారి పనిచేసే అవకాశం వచ్చింది." అని గాయత్రి దేవి చెప్పుకొచ్చారు.


టెక్నిషియ‌న్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుండాలని అన్నారు. తాను ఎంత బిజీగా ఉన్నా.. ఎప‌టిక‌ప్పుడు  హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటానని తెలిపారు. విక‌ట‌క‌వి వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిందని.. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో చాలా రీసెర్చ్ చేశామన్నారు. 1940 స‌మ‌యంలో హైద‌రాబాద్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘మాభూమి’ అనే సినిమాను చూసినట్లు చెప్పారు. అప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది..? ప్ర‌జ‌ల వేష‌ధార‌ణ‌, సంస్కృతి, సాంప్ర‌దాయాల గురించి తెలుసుకున్నట్లు వివరించారు. కథకు తగినట్లు వస్త్రాధారణ ఎలా ఉండాలనే విషయంపై లుక్ టెస్టులు చేశామన్నారు.


"ఫ్యాబ్రిక్స్ విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేం ముందు ఒకటి అనుకున్నాం. కానీ స్టోరీ తగిన మూడ్ ప్రకారం.. ఫ్యాబ్రిక్స్‌ను మార్చాల్సి వచ్చింది. హీరో లుక్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాం. అన్ని రీసెర్చ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకున్నాం. ఇందులో మేఘా ఆకాష్‌కు చుడీదార్‌ అనుకున్నాం. కానీ శారీనే బాగా సెట్ అవుతుందనిపించింది. వికటకవి వెబ్ సిరీస్‌తో చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న మ‌ర్మ‌యోగి అనే  వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నా. సినిమాల విషయానికి వస్తే.. మాన‌స‌చోర అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నా.." అని జోశ్యుల గాయత్రి దేవి తెలిపారు.


Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.