Hrithik Roshan Krish 4 Movie Updates: ప్రపంచవ్యాప్తంగా క్రిష్ సిరీస్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఈ సిరీస్ లో  వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఈ పరంపరలో మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం నాలుగో భాగం కథ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నా.. ఓ కొలిక్కి రాలేదు. గత సంవత్సరం హృతిక్ రోషన్ (Hrithik Roshan) సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. క్రిష్ పాత్ర పుట్టి 15ఏళ్లు అయిన సందర్భంగా అభినందనలు చెబుతూ.. తర్వలో క్రిష్-4 అంటూ కీలక్ అప్ డేట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా క్రిష్-4కు (Krish 4 Movie) సంబంధించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హృతిక్ తోపాటు దక్షిణాది నుంచి మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో హృతిక్ పాట పాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ చిత్రానికి హనీ ఇరానీ కథను  అందిస్తున్నారు.  రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వం వహిస్తారు. అయితే ఈ స్టోరీ క్రిష్-3 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. 


స్పేస్, టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను టైం ట్రావెల్‌ సహాయంతో వెనక్కి తీసుకురావడమే క్రిష్-4 కథ యెుక్క ప్రధానాంశంగా తెలుస్తోంది. ఇందులో 'జాదు'కి కూడా కీలకపాత్ర ఉన్నట్లు సమాచారం. మరి క్రిష్-4 ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' సినిమాలో నటిస్తున్నారు. 


Also Read: NBK 108: 'ఎన్‌బీకే 108' సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా..? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook