Daggubatis: దగ్గుబాటి కుటుంబం శోభిత ధూళిపాలను ఇంకా యాక్సెప్ట్ చేయలేదా.. సమంతనే ఫాలో అవుతున్న రానా, వెంకీ మామ
Daggubati Family Unhappy: నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థ వేడుకలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ఇప్పటికే వేణుస్వామి చేసిన వీడియో వివాదంతో చైతన్య, శోభితా నిశ్చితార్థం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవగా, అటు దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య రెండో వివాహం విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు కూడా సంచలనంగా మారాయి.
Daggubatis Still Follow Samantha: అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండేళ్ల క్రితం సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య ఎట్టకేలకు మళ్లీ పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో లైఫ్ ఇకపై బాగుంటుందని వారంతా ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే నాగచైతన్య శోభిత వివాహానికి సంబంధించి వారి కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యకు అమ్మమ్మ గారి ఇంటి నుంచి ఈ పెళ్ళికి అనుమతి లభించలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే నాగచైతన్యకు మేన బావ అయిన రానా దగ్గుపాటి, మేనమామ వెంకటేష్ ఇప్పటికి తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇంకా సమంతానే ఫాలో అవుతున్నారు.
అయితే ఇక్కడ సమంత ను ఫాలో అవ్వడం విశేషం కాకపోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పటికీ శోభిత ధూళిపాళను ఇంకా ఫాలో కాకపోవడమే చాలామందిలో సందేహాలకు దారితీస్తోంది. దీనికి తోడు నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించలేదు. అయితే దీనిపై కొన్ని వివరణలు ఉన్నాయి. ఎందుకంటే అక్కినేని నాగార్జున విడుదల చేసిన ఫోటోల్లో కేవలం చైతన్య, శోభిత, నాగార్జున మాత్రమే ఉన్నారు. ఆ వేడుకకు హాజరు అయిన ఇతర అతిథుల ఫోటోలను విడుదల చేయలేదు.
Also Read : 1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు
ఇదిలా ఉంటే మరోవైపు నాగచైతన్య, శోభిత వివాహంపై దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం దగ్గుబాటి కుటుంబానికి అంతగా రుచించడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి నాగచైతన్యకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
నాగచైతన్య బాల్యం అంతా కూడా తాతగారు రామానాయుడు ఇంట్లోనే గడిచింది. నాగచైతన్య యుక్త వయసు వచ్చిన తర్వాతే నాగార్జున ఇంటికి చేరాడని చెబుతుంటారు. దీనికి తోడు నాగచైతన్య తన మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో సైతం నటించాడు. అలాగే రానా కూడా నాగచైతన్యతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు. కానీ సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకోవడం దగ్గుబాటి కుటుంబానికి ఇష్టం లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?
మరోవైపు శోభితా ధూళిపాల, నాగచైతన్య వివాహంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన జోస్యం కూడా వివాదంగా మారింది. నిశ్చితార్థం అయిన వెంటనే వేణుస్వామి వీరు నాగచైతన్య, శోభితా జంట మూడేళ్ల లోపే విడాకులు తీసుకుంటుంది అంటూ వీడియో విడుదల చేసి వివాదానికి ఆజ్యం పోశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook