Daggubati Mohan Babu Died: మోహన్ బాబు మృతి.. తీవ్ర విషాదంలో దగ్గుబాటి కుటుంబం!
Daggubati Mohan Babu Died: దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Daggubati Mohan Babu Passed Away: దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దగ్గుబాటి రామానాయుడు సినీ పరిశ్రమలో అనేక సినిమాలకు నిర్మాతగా నిర్మించి మూవీ మొగల్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ సంస్థను నిర్మాతగా ముందుకు తీసుకు వెళుతుంటే రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా మారి అనేక సూపర్ హిట్ల అందుకున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ గా ప్రేక్షకులు అందరినీ అలరిస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.
ఇక దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా ఇప్పటికే అనేక సినిమాల్లో కనిపించగా రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయనను దగ్గుబాటి మోహన్ బాబు అని పిలుస్తూ ఉంటారు దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్ సహా చెన్నైలో వ్యాపారాల నిర్వహిస్తున్న సమయంలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్యాపారాలను, వ్యవసాయాన్ని దగ్గుబాటి రామ్మోహన్రావు సొంత ఊరు కారంచేడులో ఉండి చూసుకునేవారు.
చివరిసారిగా 2019లో దగ్గుబాటి మోహన్ బాబు పేరు మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే 2019 వ సంవత్సరం డిసెంబర్ చివరిలో దగ్గుబాటి మోహన్ బాబు ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో దొంగల ఇంట్లో చొరబడి బీరువాలు పగలగొట్టి నగదు, వెండి అప్పట్లో దోచుకు వెళ్లారు. మూడు సవరలు బంగారంతో పాటు 10 కిలోల వెండి, 60 వేల నగదు అప్పట్లో పోయినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు.
ఇక దగ్గుబాటి మోహన్ బాబు మృతి చెందారు అన్న విషయం తెలుసుకుని వెంటనే హుటాహుటిన దగ్గుబాటి సురేష్ బాబు, సినీ నటుడు, నిర్మాత దగ్గుబాటికి మేనల్లుడు అశోక్ బాబు, హీరో అభిరామ్ కారంచేడు వెళ్లారు. రేపు ఉదయం కారంచేడుకు సినీ హీరో వెంకటేష్ కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆయన కడసారి చూసుకున్న తర్వాత దగ్గుబాటి మోహన్ బాబుకు అంత్యక్రియలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం ఉందా? వెంటనే 5 ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook