Dasara Box Office Collections: దసరా మూవీ తొలి రోజే కిరాక్ కలెక్షన్స్ రాబట్టింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ విడుదలైన తొలి రోజే కమెర్షియల్ గా ఎంత గొప్ప సక్సెస్ అందుకుందంటే.. నాని మొత్తం కెరీర్లో తొలి రోజే రూ. 38 కోట్లు గ్రాస్ సాధించి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన తొలి మూవీ ఇదే కావడం విశేషం. అంతేకాదండోయ్.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన చిత్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ కూడా ఇదే కావడం మరో విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును, ప్రస్తుతం అందుతున్న బాక్సాఫీస్ ఎస్టిమేట్స్ ప్రకారం దసరా మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో విడుదలైంది. దసరా మూవీ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వివరాలను ఆ చిత్ర యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.


దసరా మూవీలో ధరణిగా నాని పర్‌ఫార్మెన్స్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మాస్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదేల రచించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి నిర్మాత చెరుకూరి సుధాకర్ మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ జోడించారు. నాని కెరీర్‌లో తొలిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నాని మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నాని సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ చూస్తోంటే.. ఈ లాంగ్ వీకెండ్ నానిదే అనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. 



 


సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ దసరా సినిమా విడుదల అవడానికి ముందే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేశాయి. మరీ ముఖ్యంగా మాస్ ట్రాక్స్ థియేటర్లలో ఆడియెన్స్‌ని ఊపేస్తున్నాయి. దసరా మూవీ ఆరంభంలోనే ఇంత భారీ కలెక్షన్స్ వచ్చాయంటే.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఇంకే ఏ రేంజ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో అలాగే టోటల్ రన్ ఇంకెంత కొల్లగొడుతుందో అని నాని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు.


ఇది కూడా చదవండి : Allu Arjun Varudu : 'వరుడు' ఎప్పటికీ ప్రత్యేకమే.. పదమూడేళ్లైందన్న హీరోయిన్


ఇది కూడా చదవండి : Varun Sandesh Financial Struggles : చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితిలో వరుణ్‌ సందేశ్.. నాటి సంగతులు చెప్పిన వితిక షెరు


ఇది కూడా చదవండి : Supritha pics : బీచ్‌లో సురేఖా వాణి కూతురు సందడి.. సుప్రిత అందాలు.. చూస్తే గుండె బేజారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK