David Warner: మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డేవిడ్ బాయ్..ఈ సారి `మహర్షి`గా అవతారం ఎత్తిన వార్నర్..
David Warner: మైదానంలో ఆటతోనే కాదు సోషల్ మీడియాలో రీల్స్ తో కూడా డేవిడ్ వార్నర్ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి ఫన్నీ వీడియోతో అలరించాడు వార్నర్. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
David Warner latest Video: ఆస్ట్రేలియ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆటతోనే కాదు మైదానం బయట రీల్స్ తోనూ మనోడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల టెస్టులతోపాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు వార్నర్. అయితే ఆటతో కాకుండా ఫన్నీ వీడియోతో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు వార్నర్. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గెటప్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. ‘మహర్షి’ మూవీలో మహేష్ చేసిన రిషి కుమార్ గెటప్ లో వార్నర్ కనిపించి అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వార్నర్ క్రికెట్ ప్రస్థానం
రీసెంట్ గా వార్నర్ టెస్టులతోపాటు వన్డేలకు గుడ్ బై చెప్పి షాకిచ్చాడు. ఈ ఏడాది జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలకనున్నాడు డేవిడ్ బాయ్. ఆ ఆసీస్ స్టార్ ఓపెనర్ 2011లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు. 112 టెస్టులు ఆడిన వార్నర్ 205 ఇన్నింగ్స్ లో మూడు డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో సహా 8,786 పరుగులు చేశాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్ లో వార్నర్ అత్యధిక స్కోరు 335 పరుగులు. 161 వన్డేలు ఆడిన వార్నర్ 22 సెంచరీలు, 33 అర్థ సెంచరీలతో 6932 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు 100 టీ20 మ్యాచ్స్ ఆడిన డేవిడ్ బాయ్ సెంచరీ, 25 అర్థ సెంచరీలతో 2964 పరుగులు చేశాడు.
పలు ఘనతలు..
వార్నర్ కంటే ముందు భారత స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli), న్యూజిలాండ్ దిగ్గజం రాస్ టేలర్(Ross Taylor)లు 100 టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్లుగా గుర్తింపు పొందారు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా వార్నర్ రికార్డు సృష్టించాడు. వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. క్రికెట్ గాడ్ సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించగా.. సచిన్ కేవలం 342 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జట్టులో వార్నర్ సభ్యుడు కావడం విశేషం.
Also Read: IPL 2024: చెన్నైకు భారీ షాక్.. ఐపీఎల్ మొదలుకాకముందే విధ్వంసక బ్యాటర్ దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook