Deccan Sarkar: దక్కన్ సర్కార్ మూవీ టీజర్ విడుదల.. హైలైట్ గా నిలిచిన కొత్త పోస్టర్
Deccan Sarkar teaser: ‘దక్కన్ సర్కార్’ సినిమా తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతికి దారితీసే ప్రయత్నంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు…అని తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ఇక ఈరోజు విరుద్ధమైన దక్కన్ సర్కార్ పోస్టర్, టీజర్ కూడా వీరి మాటలను ప్రతిబింబించేలానే ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Deccan Sarkar update : తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో.. వస్తున్న ఈ సినిమాలో.. చాణక్య, కియా రెడ్డి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.
గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఉద్యమంలో మనం ఎదుర్కొన్న కష్టాలు ఈ సినిమాలో ప్రతిబింబించాయి. కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించి ఈ కథను తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి’’ అని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ‘‘ఇలాంటి సినిమాలు మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఈ సినిమా విజయవంతం కావడానికి అందరూ సహకరించాలి. ఈ చిత్రానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం’’ అని తెలిపారు.
దర్శకుడు కళా శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యతను తెరపై ప్రతిబింబించాం. నిజమైన ఉద్యమకారుల జీవనశైలిని ఆధారంగా తీసుకుని ఈ కథను రూపొందించాం. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెప్ట్‌తో సినిమా తీశాను’’ అని చెప్పారు. ఆయన తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
సినిమాలో నటీనటులు చాణక్య, కియా రెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమా తెలంగాణ ప్రజల జీవన శైలిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు ఈ సినిమా యూనిట్ చెప్పారు. అంతేకాకుండా.. ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో కళా శ్రీనివాస్ చేసిన కృషిని ప్రశంసించారు. సినిమా ఆడియో లాంచ్‌ను నిజామాబాద్‌లో భారీగా నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రూపొందించామని, మంచి విజయాన్ని అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో చర్చ
Also Read: New Year 2025: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల షాక్.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter