Deepika Padukone opens up: రణవీర్ తో విభేదాలంటూ ప్రచారం.. పెదవి విప్పిన దీపిక!
Deepika Padukone opens up about rumours of her splitting with Ranveer Singh: రణవీర్ సింగ్ తో దీపికా పదుకొనె విడిపోతుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Deepika Padukone opens up about rumours of her splitting with Ranveer Singh: దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ లు బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్. ఒకరకంగా ఈ జంట అంటే అభిమానులకు చాలా ఇష్టం. అయితే ఈ మధ్య విడాకులు బాగా పాపులర్ కావడంతో గత నెలలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు కారణంగా అభిమానులు కూడా చాలా టెన్షన్ పడ్డారు. ఇక ఇప్పటికే ఈ వార్తల మీద రణవీర్ సింగ్ క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు ఈ వార్తల నేపథ్యంలో దీపిక రణవీర్ సింగ్ గురించి మాట్లాడింది.
వాస్తవానికి, దీపిక దీని గురించి ప్రత్యక్షంగా మాట్లాడలేదు కానీ కొంత వరకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. మేఘన్ మార్క్లే పోడ్‌కాస్ట్‌లో దీపిక మాట్లాడుతూ, తన వర్క్ వలన రణవీర్ తన నుండి కొంత దూరంగా ఉన్నాడని, అయితే నన్ను కలిసినప్పుడల్లా రణవీర్ చాలా సంతోషంగా ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకా దీపిక మాట్లాడుతూ, 'సంగీతోత్సవం కారణంగా నా భర్త వారం రోజులుగా నాకు దూరంగా ఉన్నారు.ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు నన్ను కలిసినప్పుడు నా మొహం చూసి చాలా సంతోషంగా ఉన్నాడని దీపికా పేర్కొంది.
ఇక తన భర్త గురించి దీపిక మాట్లాడిన పోడ్‌కాస్ట్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీపికా చెప్పిన ఈ విషయం విని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు, ఇక ఆమె చెప్పిన మాటలతో దీపిక, రణ్‌వీర్‌ల మధ్య అంతా బాగానే ఉందని స్పష్టమవుతోంది. ఇక ఈ పోడ్‌కాస్ట్ లో, మానసిక ఆరోగ్యంపై దీపిక చేస్తున్న కొన్ని మంచి పనుల విషయంలో మేఘన్ ప్రశంసించారు. దీపిక ఇంతకుముందు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, ఆమె తన సినిమాల ప్రచారం కోసమే ఇదంతా చేస్తుందని అనుకున్నారు.
ఈ విషయం పై దీపికా మాట్లాడుతూ, ‘’నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఇలా చేస్తున్నాను అని భావించారని, కొంతమంది ఏదైనా సంస్థ నాకు డబ్బు ఇచ్చిందని కూడా అన్నారను అన్నారు. ఇక దీపిక లైవ్ లవ్ లాఫ్ అనే సంస్థను ప్రారంభించింది.ఇది మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే ఒక సంస్థ. దీపిక తన ఫౌండేషన్ కింద తమిళనాడు గ్రామానికి చెందిన కొంతమంది మానసిక రోగులను, రి కేర్ టేకర్లను కలిసింది. ఇక దీపికా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పుడు పఠాన్‌లో కనిపించబోతోంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా ఆమె ప్రాజెక్ట్Kలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Tollywood Hero Arrested: జూనియర్ ఆర్టిస్ట్ పై రేప్.. తెలుగు హీరో అరెస్ట్?
Also Read: Mohan Babu Repeating Mistake: చిరంజీవి చేసిన తప్పే రిపీట్ చేస్తున్న మోహన్ బాబు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook