Deepika Padukone: ఎన్నో సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. అమ్మ లేకుంటే అదే జరిగేది.. దీపికా సంచలనం!
Deepika Padukone Recalls her her suicidal tendency: తాను చాలా సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని కీలక విషయాలను బయటపెట్టింది దీపికా పదుకొనె. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Deepika Padukone Recalls her her Suicidal Tendency: దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా తెలుగు వారికి కూడా సుపరిచితమే. అయితే ఆమె గతంలో డిప్రెషన్ కి లోనయ్యానని సూసైడ్ కూడా చేసుకోవాలనిపించిందని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన డిప్రెషన్ రోజులను మరోసారి గుర్తు చేసుకుంటూ కొన్ని కామెంట్లు చేశారు. గతంలో డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్న తాను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని తనకు ఎక్కువగా అలాంటి ఆలోచనలే వస్తూ ఉండేవని దీపికా పడుకునే చెప్పుకొచ్చింది.
కారణం లేకుండానే బాగా ఏడ్చేదాన్ని అని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా నిద్రపోవాలని ప్రయత్నించే దాన్ని అని దీపికా చెప్పుకొచ్చారు. ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనిపించేదని అయితే నాకు డిప్రెషన్ ఏర్పడిన సమయంలో మా అమ్మ నాకు ఎంతో తోడుగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా కెరీర్ చాలా బాగుండేది కానీ ఎందుకో వెలితిగా ఉండేదని, బాధ కలిగేదని అసలు ఆ బాధకు కారణం ఏమిటో కూడా తెలియక ఏడుపొచ్చేదని ఆమె చెప్పుకొచ్చారు. సాధారణంగా తన తల్లి, తండ్రి బెంగళూరులో ఉండేవారని అప్పుడప్పుడు మాత్రం తనను చూడడం కోసం ముంబై వచ్చేవారని ఆమె వెల్లడించారు.
వారు వచ్చినప్పుడు వాళ్ల ముందు బాగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించేదాన్ని కానీ ఒకసారి మాత్రం ఉన్నట్టుండి మా అమ్మ దగ్గర బయట పడిపోయానని అది చూసి ఆమె భయపడిపోయిందని అన్నారు. అప్పుడు నీకు ప్రొఫెషనల్ సమస్యలా? లేక బాయ్ ఫ్రెండ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగిందని అయితే అసలు ఏం చెప్పాలో తెలియక నేను మళ్ళీ ఇబ్బంది పడ్డాను ఎందుకంటే అసలు నా బాధకు కారణం ఏమిటో నాకే తెలియదని చెప్పుకొచ్చారు.
నాలో ఏదో తెలియని ఒక వాక్యూమ్ ఏర్పడిందని మా అమ్మ అర్థం చేసుకుని నేను డిప్రెషన్ నుంచి బయటపడేలా చేశారని ఆ సమయంలో దేవుడే మా అమ్మను నా దగ్గరికి పంపాడేమో అని అంటూ దీపిక చెప్పుకొచ్చింది. ఇక దీపిక ఇలా ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతున్న వారి కోసం లివ్ లవ్ లాఫ్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఒత్తిడికి గురవుతున్న వారు ఈ ఫౌండేషన్ను సంప్రదిస్తే ఒత్తిడి దూరం చేసుకునే విధంగా అక్కడి కౌన్సిలర్లు మైండ్ వాష్ చేస్తారు.
Also Read: Bimbisara: అప్పట్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బింబిసార డైరెక్టర్.. ఏ సినిమానో తెలుసా?
Also Read: Shivani: పొట్టి గౌనులో చుట్టుకొలతలు చూపిస్తూ కాక రేపిన శివానీ రాజశేఖర్..కళ్ళతోనే కవ్వింపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook