బాలీవుడ్ లో టాప్ నటీమణులలో ఒకరైన దీపికా పదుకొనె నవంబర్ 19న ఆదివారం నాడు అమరావతికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సోషల్ మీడియా పురస్కారం అందుకోనున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రచారం కోసం సోషల్ మీడియా అవార్డులను నిర్వహిస్తోంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం 'సోషల్ మీడియా సమ్మిట్-2017' అవార్డులలో భాగంగా అమితాబ్ బచ్చన్ కు 'సోషల్ మీడియాలో అత్యంత ప్రసిద్ధ భారతీయ నటుడు' అవార్డుకు, దీపికా పదుకొనె కు 'సోషల్ మీడియాలో అత్యంత ప్రసిద్ధ భారతీయ నటి' అవార్డుకు ఎంపిక చేసింది. ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు 'అవార్డు స్వీకరించడానికి అమరావతికి వస్తాను' అని దీపికా అన్నారు. కానీ అమితాబచ్చన్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు.


వీరే కాక, దక్షిణాది నటులలో రాణా దగ్గుబాటి 'అత్యంత చురుకైన దక్షిణ భారత నటుడు' అవార్డును, సంగీత దర్శకుడు అనిరుద్ 'సోషల్ మీడియాలో అత్యంత సంచలనాత్మక' అవార్డును అందుకోనున్నారు. ఇలా సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వివిధ వ్యక్తుల కోసం దాదాపు 30 అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డు కార్యక్రమంలో దక్షిణాది, హిందీ భారతీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆహ్వానితులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ వెల్లడించారు.