Deepika Padukone and Ranveer Singh to part ways after four years: బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌లలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే జోడి ఒకటి. చాలాకాలం ప్రేమించుకున్న ఈ స్టార్ జోడి 2018లో వివాహబంధంతో ఒక్కటైంది. వివాహం అయినప్పటి నుంచి పార్టీస్, అవార్డు ఫంక్షన్స్‌, సినిమా ఈవెంట్స్‌లో దీపికా-రణ్‌వీర్‌లు జంటగానే కనిపించేవారు. ఎప్పుడూ కూడా వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అలాంటి ఈ జోడి విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్‌ ఉమైర్‌ సంధు రెండు రోజుల క్రితం రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే మధ్య విభేదాలు ఉన్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశాడు. 'బ్రేకింగ్.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే మధ్య సంబంధం బాగాలేదు' అని ట్వీటాడు. ఆ ట్వీట్‌ కాస్త క్షణాల్లో వైరల్‌ అయింది. దాంతో నెటిజన్లు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే విడిపోతున్నారా? అంటూ షాక్ అవుతున్నారు. ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది అని గూగుల్‌లో వెతుకుతున్నారు. 


ఈ వార్తలపై దీపికా పదుకొనే ఇప్పటి వరకు స్పందించలేదు. ఐతే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్‌వీర్‌ సింగ్ తమ విడాకుల రూమర్స్‌పై స్పందించాడు. 'దీపికాతో నాకు 2012లో పరిచయం అయింది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తనపై ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్‌లోకి వచ్చాక జీవితం అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు' అని అన్నాడు. తనతో మళ్ళీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని, త్వరలోనే తమను కలిసి చూస్తారు అని రణ్‌వీర్‌ స్పష్టం చేశాడు. 


ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. 'రాకీ అవుర్‌ రాణికి ప్రేమ్‌ కహాని' షూటింగ్ పూర్తికాగా.. ‘సర్కస్‌’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దీపికా పదకొనే కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. దీపిక నటించిన పఠాన్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌-కే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెకు గాయాలు అయిన విషయం తెలిసిందే. 
Also Read: T20 World cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్ 2022 మ్యాచ్ షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ


Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook