Devara 3 days Box Office Collections: : మూడు రోజుల్లో రూ. 300 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర ఆగని దేవర దండయాత్ర..
Devara 3 days Box Office Collections: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `దేవర`. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన `ఆర్ఆర్ఆర్` మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర వీర విహారం చేసిన దేవర మూవీ మొత్తంగా మూడు రోజుల్లో రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది.
Devara 3rd day Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ దేవర దూకుడు మీదుంది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ లెవల్లో ఫేమసైన ఎన్టీఆర్ ..కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' మూవీతో పలకరించారు. ముందుగా ఊహించినట్టుగా తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. తొలి రోజే దాదాపు రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మాస్ లో తన క్రేజ్ ఏ లెవల్లో ఉందో మరోసారి దేవరతో ప్రూవ్ అయింది. 'దేవర' మూవీలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. గతంలో ఆంధ్రావాలా, శక్తి సినిమాల్లో తండ్రీ కొడుకులగా చేసిన సినిమాలు ఫ్లాపైనా.. సెంటిమెంట్ ను పక్కన పెట్టి తారక్.. చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల దుమ్ము దులుపుతుంది. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను ఫస్ట్ డే నే 'దేవర' మూవీ క్రాస్ చేయడం మాములు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు.
అంతేకాదు రాజమౌళి సినిమా తర్వాత హిట్ రాదనే సెంటిమెంట్ కూడా 'దేవర' మూవీతో బ్రేక్ చేసాడు. తొలి రోజే దాదాపు 60 శాతం రికవరీ సాధించిన ఈ మూవీ హిందీలో కూడా మంచి హోల్డ్ ను నిలబెట్టుకుంది. మొత్తంగా రోజుల్లో అక్కడ రూ. 20 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఓ రకంగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ పై మంచి గ్రిప్ సంపాదించాడు ఎన్టీఆర్. ఒక రకంగా ఈ టెస్ట్ లో పాస్ అయ్యాడు. ఆదివారం ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఒక నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. త్వరలో రాయలసీమలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి రానుంది.
మొత్తంగా మూడు రోజుల్లో ఈ మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. హీరోగా ఎన్టీఆర్ కు రెండో రూ. 300 కోట్ల గ్రాస్ మూవీ. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల షేర్.. రూ. 304 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపుతూ దూసుకుపోతుంది. మొత్తంగా 'దేవర' ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఈ మూవీ రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ సినిమా రూ. 183 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో దాదాపు 90 శాతం రికవరీ అయింది. రాబోయే దసరా సెలవుల్లో 'దేవర' మూవీ ఎలాంటి హోల్డ్ ను నిలబెట్టుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.