Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు పక్షవాతం.. షాక్‌లో ఫ్యాన్స్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..!
Janhvi Kapoor Health Condition: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ మధ్యనే హాస్పిటల్లో.. ఎడ్మిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ ..కపూర్ స్వయంగా ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని.. హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అని స్పష్టం చేశారు. తాజాగా తన ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు బయట పెట్టింది జాన్వీకపూర్.
Janhvi Kapoor Health Update: అలనాటి లెజెండరీ నటి శ్రీదేవి మొదటి కూతురు జాన్వి కపూర్ గురించి తెలియని వారు ఉండరు. 2018 లో ధడక్ అనే సినిమాతో హిందీలో.. హీరోయిన్ గా పరిచయం అయిన జాన్వి కపూర్.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో కూడా నటిస్తూ.. ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
సినిమాలతో మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు వీడియోలతో.. ప్రేక్షకుల దృష్టిని కట్టిపడేస్తూ ఉంటుంది జాన్వి. ఈ మధ్యనే ఒక సినిమా షూటింగ్ సమయంలో.. ఆమె తిన్న ఫుడ్ కారణంగా.. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి.. జాన్వి కపూర్ ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జాన్వి కపూర్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎన్నో పుకార్లు బయటకు వచ్చాయి.
తాజాగా ఈ పుకర్లపై క్లారిటీ ఇచ్చింది జాన్వీ కపూర్. "గత కొద్ది రోజులుగా వరుసగా షూటింగ్స్ ఉండడం వల్ల.. చాలా ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంచెం వీక్ అయ్యాను. ఒక పాట షూటింగ్ కోసం చెన్నై వెళ్లాను. అక్కడ ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో నొప్పి మొదలైంది. నెమ్మదిగా భరించలేనంత నొప్పిగా మారింది. ఒంట్లో వణుకు కూడా రావడంతో భయమేసింది. సహాయం లేకుండా బాస్ రూమ్ కి కూడా వెళ్లలేకపోయాను. పక్షవాతం వచ్చింది ఏమో అని భయం కూడా వేసింది. కనీసం నడిచే ఓపిక కూడా లేదు. ఎలాగో హాస్పిటల్ కి వెళ్లి మూడు రోజులు అక్కడే చికిత్స తీసుకున్నాను" అని క్లారిటీ ఇచ్చింది జాన్వి కపూర్.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడినట్టు చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఆగస్ట్ 2న ఈమె హీరోయిన్గా నటించిన ఉలఘ్ అనే హిందీ సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook