Dhamaka Collectons: దుమ్మురేపుతున్న ధమాకా.. రవితేజ కెరీర్లోనే టాప్ ఓపెనింగ్ కలెక్షన్స్!
Dhamaka Day 1 Collectons : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం ధమాకా 23వ తేదీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా మొదటి రోజు వసూళ్లపై ఒక లుక్కు వేద్దామా?
Dhamaka Day 1 Collectons Worldwide: రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం ధమాకా. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బెజవాడ ప్రసన్నకుమార్ అందించిన కథతో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వివేక్ కూచిభట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అలాగే ఈ సినిమాకు అభిషేక అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ కూడా సహనిర్మాతగా వ్యవహరించారు.
ఇక ఈ ఏడాది రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కచ్చితంగా ధమాకా సినిమాతో హిట్ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేసిన రవితేజ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇక ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 23వ తేదీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
ఇక మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనర్ గా నిలిచినట్లు తెలుస్తోంది. అనేక థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టారని ఉదయం ఆటల కంటే ఈవెనింగ్ షోస్ కి ప్రేక్షకులు విపరీతంగా తరలివచ్చారని అంటున్నారు. మొత్తం మీద ఈ దెబ్బతో రవితేజ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాగా ధమాకా నిలవబోతోందని తెలుస్తోంది.
ఇక మొదటి వీకెండ్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్స్, బీమ్స్ అందించిన సంగీతం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చాయి అని అంటున్నారు. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శ్రీ లీల గ్లామర్ త్రినాధరావు మార్క్ కామెడీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఎంత వసూళ్లు వచ్చాయి అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ సినిమాకి వసూళ్ళు మాత్రం ఒక రేంజ్ లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
ధమాకా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఈ మేరకు ఉంది. నైజాం: 2.10 కోట్లు, సీడెడ్: 72 లక్షలు, ఉత్తరాంధ్ర: 56 లక్షలు, తూర్పు: 24 లక్షలు, పశ్చిమ: 26 లక్షలు, గుంటూరు: 40 లక్షలు, నెల్లూరు : 13 లక్షలు ఏపీ తెలంగాణ మొత్తం:- 4.66 కోట్లు షేర్ 7.85కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక సహా మిగతా భారత్ దేశంలో 45 లక్షలు, ఓవర్సీస్ లో 15 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్:- 5.26 కోట్లు (9.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. సినిమా మొత్తం బిజినెస్ = 18.30 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ 19.00 కోట్లు గా నిర్ణయయించారు. ఇక సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 13.74 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
ఇక ఈ సినిమాతో పాటు లాఠీ, కనెక్ట్, 18 పేజెస్ వంటి సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఈ అన్ని సినిమాల కంటే ధమాకా సినిమాకే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరణ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రోజు 9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ప్రపంచవ్యాప్తంగా ఈ మేరకు వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక పూర్తి కలెక్షన్స్ ఇంకా అందాల్సి ఉంది.
Also Read: Sobhita Dhulipala Hot Photos: రెడ్ హాట్ డ్రెస్సులో రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. కనిపించీ కనిపించకుండా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.