Dhanraj Directorial Debut: సముద్రఖని మనకు నటుడుగా అలానే దర్శకుడిగా బాగా పరిచయం. అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో విలన్ గా చేసిన ఈయన.. ఈమధ్య బ్రో చిత్రంతో ఆయన దర్శకత్వ ప్రతిభ కూడా చూపించారు. 
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా చేసిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. కాగా ఇప్పుడు మరో సినిమాతో నటుడుగా ఇంకోసారి మనల్ని మెప్పించడానికి సిద్ధమైపోయారుశసముద్రఖని.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సముద్రఖని ప్రధాన పాత్రలో .. జబర్దస్త్ తో మనకు పరిచయమై ఆ తరువాత తెలుగు సినిమాలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకత్వంలో నూతన సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి.


తెలుగు సినిమా ప్రేక్షకులు ఎమోషనల్ సినిమాలు బాగా ఇష్టపడతారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ధనరాజ్ కూడా అదే పాయింట్ బేస్ చేసుకుని తండ్రి కొడుకుల ఎమోషన్ తో.. దానితో పాటు ఎవరూ టచ్ చెయ్యని ఒక పాయింట్ తో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


ఇక ఈ సినిమాకి ఈమధ్య చాలా మంచి పేరు తెచ్చుకున్న విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ మాటలు సమకూరుస్తూన్నారు.స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. మరోపక్క సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. 


ఇక ఈ సినిమాతో మొన్నటి వరకు మనకు కమెడియన్ గా అలానే మంచి యాక్టర్ గా పరిచయమైన ధనరాజ్ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించబోతున్నారు. కాగా ఈ చిత్రం లో ధనరాజ్ అలానే సముద్రఖని ఇద్దరూ లభిస్తూ ఉండడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పైన ఆసక్తి నెలకొంది. ఈ మధ్యనే జబర్దస్త్ వేణు కూడా దర్శకుడుగా మారి బలగం లాంటి సూపర్ హిట్ అందుకున్నారు. మరి అదే దారిలో మన ధనరాజ్ కూడా సూపర్ హిట్ అందుకుంటారేమో వేచి చూడాలి.


Also read: Balineni Issue: ప్రకాశం జిల్లాలో సంక్షోభం సమసినట్టేనా, సీఎం జగన్‌తో బాలినేని భేటీ


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook