Dhanush Telugu movie: కొలవెరి డీ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ సినిమా సినిమాకు వైవిద్యామైన పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంతో పాటు ఆయన సినిమాలు తెలుగులోను డబ్​ అవుతుంటాయి. ఇలా రఘువరన్ బీటెక్​, మారీ వంటి సినిమాలు ఇక్కడ మంచి విజయం సాధించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తెలుగు వారికి మరింత దగ్గరయ్యేందుకు ధనుష్​.. నేరుగా తెలుగు సినిమాలో (Dhanush straight Telugu Film) నటిస్తున్నారు. తమళంలోనూ ఈ సినిమాను ఏకకాలంలో తెరకెక్కనుంది.


ఈ సినిమా టైటిల్​ను తాజాగా వెల్లడించింది చిత్ర బృందం. తెలుగులో ఈ సినిమాను 'సార్​' పేరుతో (Dhanush  Telugu Film Sir) రానుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.



ఇంతకు ముందు  'తొలి ప్రేమ' (వరుణ్​ తేజ్​ సినిమా), రంగ్​దే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ అట్లూరీ (Venky Atluri).


ఈ సినిమా తమిళంలో 'వాతి'గా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో సంయుక్త మేనన్​ హీరోయిన్​. జీవీ ప్రకాశ్ (GV Prakash)​ మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ వంశి- సాయి సౌజన్య నిర్మాతలు.


Also read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్


Also read: Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook