Martin Movie Review: ధృవ సర్జ ‘మార్టిన్’ మూవీ రివ్యూ.. మెప్పించని యాక్షన్ డ్రామా..!
Martin Movie Review: ప్రస్తుతం తెలుగు సహా అన్ని సినీ ఇండస్ట్రీస్ లో ప్యాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కన్నడ నాట కేజీఎఫ్, కాంతార సినిమాలు అన్ని భాషల్లో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో కన్నడ స్టార్ ధృవ సర్జ తాజాగా ‘మార్టిన్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
నటీనటులు: ధృవ సర్జ, వైభవి శాండిల్య, అన్వేషి జైన్,నికిత్ ధీర్, అచ్యుత్ కుమార్, సుకృతా వాగ్లే తదితరులు
ఎడిటర్: ఎం. ప్రకాష్, మహేష్ ఎస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
సంగీతం: మణి శర్మ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ర వి బస్రూర్
నిర్మాత: ఉదయ్ కే మెహతా
దర్శకత్వం: ఏపీ అర్జున్
విడుదల తేది: 11-10-2024
యాక్షన్ కింగ్ అర్జున్ నట వారసుడిగా ధృవ సర్జ.. కన్నడ నాట యాక్షన్ ప్రిన్స్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా తన మేనమామ అర్జున్ ఇచ్చిన కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన చిత్రం ‘మార్టిన్’. పీఏ అర్జున్ దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అర్జున్ (ధృవ సర్జ) నిజాయితీ, దేశ భక్తి గల కస్టమ్స్ అధికారి. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు వెళతారు. అక్కడ కొన్ని సంఘటలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అతినికి సంబంధించిన వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. వాళ్లందరినీ ఒకే పాట్రన్ లో చనిపోతూ ఉంటారు. కస్టమ్స్ ఆఫీసర్ అయిన అర్జున్ ఎందుకు పాకిస్థాన్ కు వెళ్లాడు. మరోవైపు మన దేశంలో అతని ప్రియురాలు ప్రీతి (వైభవి శాండిల్య) కు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. పాకిస్థాన్ వెళ్లిన అర్జున్ అక్కడ చిక్కుకుపోతాడు. ఆ తర్వాత అతను మన దేశానికి ఎలా తిరిగి వచ్చాడు. ఈ కమ్రంలో అతని విధి నిర్వహణలో అడ్డంగా వచ్చిన విద్రోహులను ఎలా అంతం చేసాడు. ఈ క్రమంలో మార్టిన్ ఎవరు.. ? అతనికి అర్జున్ కు సంబంధం ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
150 చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు పలు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకు కథతో పాటు స్క్రీన్ ప్లే అందించాడు. కానీ దర్శకుడు ఈ సినిమాను సరైన విధంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు.భారీ యాక్షన్ ఎపిసోడ్స్, లొకేషన్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని విషయాల్లో దృష్టి పెట్టినా.. దర్శకత్వం పై సరైన దృష్టి పెట్టలేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ఆడియన్స్ ను కన్విన్స్ చేసి చెప్పడంలో విఫలమయ్యాడు. మొత్తంగా బిల్డప్ షాట్ లపై పెట్టిన శ్రద్ద.. సినిమాను తెరకెక్కిండంపై పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో పీవోకేలో మన దేశపు జెండాను ఎగరేసే కొన్ని దేశ భక్తి సీన్స్ బాగున్నాయి. దేశం ఒక్కటే అయినపుడు.. సౌత్ ఇండియన్ అని హీరోతో డైలాగు చెప్పించపోయి ఉంటే బాగుండేది. ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు.
ఈ సినిమాలో ధృవ సర్జనే హీరో కమ్ విలన్ గా చూపించాడు. అర్జున్, మార్జిన్ అనే రెండు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగానే ఉంది. కానీ మార్జిన్ గా, అర్జున్ గా ఒకే తరహాలో ఉన్నపుడు ఎవరు ఎవరనేది ప్రేక్షకులను కన్ఫ్యూజన్ చేసాడు. ముఖ్యంగా ఈ సినిమాను మెడికల్ మాఫియాను బేస్ చేసుకొని తెరకెక్కించాడు. దాన్ని ఇంకాస్త ఇంపాక్ట్ గా చూపించి ఉంటే బాగుండేది. కేజీఎఫ్ తరహా యాక్షన్ సీన్స్ నే నమ్ముకున్నాడు. చివరకు మార్టిన్ ఏమయ్యాడు. అర్జున్ .. దేశ ద్రోహుల అంతం చేసాడనేది చెబితే.. చూసే ప్రేక్షకులకు కిక్ ఉండదు. ఈ సినిమాకు మణిశర్మ పాటలు .. ప్రేక్షకులు బయటవెళ్లి సిగరేట్ తాగేలా ఉన్నాయి. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాడు. సినిమా ప్రారంభంలోనే పాకిస్థాన్ జైలులో ఫైట్ సీన్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. అంతేకాదు చివర్లో ఈ సినిమాక సీక్వెల్ కూడా ఉన్నట్టు చూపించాడు.
నటీనటుల విషయానికొస్తే..
ధృవ సర్జ.. బాహుబలి తరహా కండలతో ఈ సినిమాలో నటించి మెప్పించాడు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించడంలో కాస్తంత తడబడ్డాడు. నటన విషయంలో ఇంకాస్త మెరుగుపడాలి. రెండు పాత్రలను చూసినపుడు కళ్లలోని ఎక్స్ ప్రెషన్స్ తో హీరో ఎవరు.. ? విలన్ ఎవరేది కళ్లతోనే నటించి చూపించాలి. ఈ విషయంలో ధృవ సర్జ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక మామ అర్జున్ మన దేశంలోనే ఏ హీరోకు లేనట్టు యాక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. ఆయ బాటలో యాక్షన్ ప్రిన్స్ అనే టైటిల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోసాడు. హీరోయిన్ వైభవి శాండిల్య పర్వాలేదు. అన్వేషి జైన్ తన అందాలతో మెస్మరైజ్ చేసింది. మిగతా నటీనటులకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదనే చెప్పలేదు.
ప్లస్ పాయింట్స్
ధృవ సర్జ స్క్రీన్ ప్రెజెన్స్
యాక్షన్ సీన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
కనెక్ట్ కానీ ఎమోషన్స్
పంచ్ లైన్.. ‘మార్టిన్’.. బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ..
రేటింగ్: 2/5
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter