Dil Raju another Shock to Mythri Movie Makers Team: 2023 సంక్రాంతికి తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ సంస్థగా వ్యవహరించగా హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోపక్క ఈ సినిమాలను ముందుగా డిస్ట్రిబ్యూట్ చేయాలని భావించిన దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నుంచి నెగిటివ్ రిప్లై రావడంతో స్వయంగా నిర్మిస్తున్న వారసుడు సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ఈ సినిమాని తమిళనాడులో కొన్ని టాక్స్ రేట్ల కోసం తమిళ సినిమాగా ప్రస్తావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నామని చెబుతున్నారు.


అయితే ఈ సినిమాల విషయంలో దిల్ రాజు చాలా సీరియస్ గా ఉన్నారు. వారసుడు సినిమాని వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి మంచి వసూళ్లు రాబట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి గతంలో ఆయన డబ్బింగ్ సినిమాల మీద ఇప్పుడు చేస్తున్న దానికి కొన్ని విరుద్ధమైన కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.


ఇదంతా ఇలా ఉండగా తాజాగా థియేటర్ల వ్యవహారం మీద దిల్ రాజు ఆసక్తికరంగా స్పందించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థియేటర్లు దక్కకుండా మీరు ఎక్కువ థియేటర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారట నిజమేనా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను నా ధియేటర్లను వేరే వాళ్లకు త్యాగం చేసే అంత త్యాగమూర్తిని కాదు, నేను వ్యాపారం చేయడానికి ఇక్కడ ఉన్నాను వ్యాపారం చేస్తున్నానని ఆయన కామెంట్ చేశారు.


నాకు తమిళనాడులో ఎక్కువ థియేటర్లు దొరక్కపోతే నేను వేరే వాళ్ళని అడిగి థియేటర్లు తీసుకుంటున్నాను అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు థియేటర్లు దొరక్కపోతే నా ధియేటర్లను అడిగితే అప్పుడు ఆలోచిస్తాను కానీ వారు అడగకపోతే నేను ఎలా స్పందిస్తాను అంటూ ఆయన కామెంట్ చేశారు. దానికి తోడు తన సొంత సినిమాతో పాటు ఆయన అజిత్ తునీవు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి తనకు మిగులు ఉంటాయని అనుకున్న థియేటర్లను ఈ సినిమా కోసం వాడే అవకాశం కనిపిస్తోంది.


అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరుచుకోవడంతోనే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అనే టాక్ వినిపిస్తోంది. ఇక వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత తమకు సహాయం చేయమని దిల్ రాజుని ఎలా కోరుతాం అనేది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాదన, మొత్తం మీద వీరి మధ్య భేదాభిప్రాయాలతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 


Also Read: Prabhas on Kriti Sanon: కృతితో రిలేషన్ పై ఓపెన్ అయిపోయిన ప్రభాస్.. అసలు విషయం ఏంటంటే?    


Also Read: Alekhya Harika Hot Photos: చాలాకాలం తరువాత పొట్టిబట్టల్లో అలేఖ్య హారిక హాట్ ట్రీట్.. జబర్దస్త్ అందాల విందు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook