Dil Raju Getting Trolled for Sensational Comments: వెంకటరమణారెడ్డి అంటే ఎవరో గుర్తుపట్టడం కష్టమే కానీ దిల్ రాజు అనే పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన నిజానికి నిర్మాత అయినా మంచి స్టార్ క్రేజ్ అయితే సంపాదించారు నిజానికి ఈ పేరు ఎప్పటికప్పుడు తెలుగులో చర్చనీయాంశం అయితే అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆయన గురించి పాజిటివ్ వార్తలు వస్తే మరికొన్నిసార్లు నెగిటివ్ వార్తలు వస్తూ ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎప్పటికప్పుడు దిల్ రాజు హాట్ టాపిక్ అవుతూ ఉండటం మాత్రం కామన్. టాలీవుడ్ లో దిల్ రాజు కంటే ముందు పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. ఆయన తరువాత కూడా నిర్మాతలుగా మారి పెద్ద పెద్ద వారైనా ఉన్నారు. కానీ దిల్ రాజుది ప్రత్యేక శైలి. కార్తికేయ 2 సినిమా రిలీజ్ విషయంలో ఆయనే సినిమాకు అడ్డుపడ్డారని ప్రచారం జరిగి ఆ తర్వాత అందరూ దాన్ని ఖండించి ఆ వివాదం ముగిసింది అనుకునే లోపే ఇప్పుడు వారసుడు వివాదం తెర మీదకు వచ్చింది.


అయితే దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తానని దిల్ రాజు ప్రకటించారు. అయితే ఈలోపే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కనిపించారు. అక్కడ దిల్ రాజు మాట్లాడుతూ తన దగ్గర కేవలం 37 థియేటర్లు మాత్రమే ఉన్నాయని వాటిని ఉంచుకుని ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నాను అని అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎవరూ ఎవరి మాట వినరని పేర్కొన్న దిల్ రాజు సినిమా పరిశ్రమ అంటే ఒక కుటుంబం అనే మాటలు పేరుకే గాని ఇక్కడ అందరూ కలిసి నడవడం అనే మాట ఉండదని తేల్చేశారు.


ఇక సినిమాల్లోకి రావడం వల్ల తనకు పాపులర్ అనిపించి ఉండవచ్చు కానీ తన స్నేహితులు తనతో పాటు కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వెళ్లి కొన్ని వందల కోట్లు సంపాదించారని వారితో పోలిస్తే తాను ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమా అంటే సిగ్గు నీతి మానం లేనిదే అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.  ఎందుకంటే ఇదే సినిమాని నమ్ముకుని దిల్ రాజు ఇప్పటికే 20 ఏళ్ల కెరీర్ లో ఎంతో సంపాదించారు,


ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించారు. అలాంటి సినీ పరిశ్రమను సిగ్గు నీతి మానం లేని పరిశ్రమ అంటూ కామెంట్ చేయడం ఎంతవరకు సబబు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఇంటర్వ్యూలో ప్రోమో మాత్రమేనని పూర్తి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత దిల్ రాజు ఏ సందర్భంలో ఆ మాటలు మాట్లాడి ఉంటారో క్లారిటీ రావచ్చని ఆయన అభిమానులు అంటున్నారు. మొత్తం మీద దిల్ రాజు మీద మాత్రం ఇప్పుడు నెగిటివ్ గా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక దిల్ రాజు కామెంట్స్ పై మీ స్పందన ఏమిటో తెలియజేయండి మరి.


Also Read: Jai Balayya Song : నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టి.. ట్యూన్ మీద పెట్టాల్సింది.. కాపీ ట్యూన్‌తో తమన్‌పై ట్రోల్స్


Also Read: Balakrishna- Boyapati : బాలయ్య-బోయపాటి మూవీ కోసం కొట్టుకుంటున్న ఆ నలుగురు టాప్ ప్రొడ్యూసర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook