Vijay Vaarasudu Release Date విజయ్ వారిసు సినిమాను తమిళంలో జనవరి 11న రిలీజ్ చేస్తున్నామని, ఆ తరవాత జనవరి 14న తెలుగులో వారసుడు సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు. ఇండస్ట్రీ పెద్దల సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, సంక్రాంతికి మన తెలుగు హీరోలైన బాలయ్య, చిరంజీవిలకు ఎక్కువ థియేటర్లకు దొరకాలని, వారి సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే తన సినిమాను వాయిదా వేసుకున్నాను అంటూ దిల్ రాజు చెప్పేశాడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి, బాలయ్య సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వాలని నేను వెనక్కి తగ్గాను.. తమిళంలో ముందు రిలీజ్ అయి.. తరువాత తెలుగులో రిలీజ్ అయితే.. ఎలా అని చాలా మంది అడిగారు.. కానీ నాకు నా సినిమా మీద నమ్మకం ఉంది.. మనకు క్లాష్ అవ్వొద్దు అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశాను.. ఎవరి డబ్బు పోయినా డబ్బే.. నాకు ఇప్పటికే సంక్రాంతికి తెలుగు వాళ్లు ఎన్నో హిట్లు ఇచ్చారు.. ఇప్పుడు సంక్రాంతికి వారసుడిని చేయాలని ఫిక్స్ అయ్యాను.. అందుకే జనవరి 14న వారసుడు సినిమాను రిలీజ్ చేస్తున్నాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.


సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలనే ఉద్దేశ్యంతోనే నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను అని దిల్ రాజు అన్నాడు. అందరు నిర్మాతలు బాగుండాలని, పైగా అందరూ నా మీద పడి ఏడుస్తుంటారు.. థియేటర్లు ఇవ్వడని అంటుంటారు.. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడుతాయని అంటారు.. అలా నా మీద అందరూ మాటలు వదిలేస్తుంటారు అని దిల్ రాజు అన్నాడు.


నన్ను ఎవ్వరూ కార్నర్ చేయలేదు.. నాకు సినిమానే ముందు.. సినిమానే గొప్ప.. నన్ను కార్నర్ చేసే సీన్ ఎవ్వరికీ లేదు.. నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను.. అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. నా సినిమా ఆల్రెడీ రెడీగా ఉంది.. సినిమా పనులు పూర్తి కాలేదనే ఉద్దేశ్యంతో ఇలా వాయిదా వేయలేదు.. నా సినిమా ఆల్రెడీ పూర్తయింది.. రేపు సెన్సార్ అవుతుంది.. ఎల్లుండి నా దగ్గర కాపీ ఉంటుంది అని దిల్ రాజు కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశాడు.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Sreemukhi Brother : శ్రీముఖి తమ్ముడి బర్త్ డే పిక్స్.. ముద్దులు పెట్టేసిన రాములమ్మ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి