Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. మూవీ గురించి అనౌన్స్ చేసినప్పుడు టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని ఉండడం పై అప్పట్లో సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు వీటి పై స్పందించిన దిల్ రాజ్.. మూవీ టైటిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ పాయింట్ కూడా బయటపెట్టారు ఈ నిర్మాత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో దిల్ రాజ్ పాల్గొన్నారు. దిల్ రాజు తో పాటు విజయ్ దేవరకొండ,ఆర్. నారాయణ మూర్తి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి మాట్లాడిన దిల్ రాజ్.. ఈ మూవీ కుటుంబం ఎదుగుదల కోసం కష్టపడే ప్రతి ఒక్క ఫ్యామిలీ స్టార్ కోసం అని చెప్పారు. అంతేకానీ అందరూ అనుకుంటున్నాట్టు ఇది విజయ్ దేవరకొండ ని స్టార్ట్ చేయడానికి తీస్తున్న సినిమా కాదు అని క్లారిటీ ఇచ్చారు.


‘ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ట్ అన్న టైటిల్ పెట్టిన తర్వాత.. విజయ్ దేవరకొండ ను ఓ పెద్ద స్టార్ గా చూపించడానికి ఈ టైటిల్ పెట్టారులే అన్నట్లు చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మూవీ టైటిల్ వెనక అసలు ఉద్దేశాన్ని రివీల్ చేయాలని భావిస్తున్నాను అని  దిల్ రాజ్ అన్నారు.నాకు తెలిసి అందరూ తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడే ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో ఫ్యామిలీ స్టార్స్. అదే మా సినిమా మెయిన్ కంటెంట్ కూడా’ అని దిల్ రాజ్ వెల్లడించారు.


దిల్ రాజ్ మూవీ టైటిల్ గురించి డిస్కస్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస డిజాస్టర్స్ తో బాధపడుతున్న విజయ్ దేవరకొండ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పరుశురాం డైరెక్షన్ లో తిరిగి విజయ్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూవీ టీజర్ కూడా స్టోరీ పై ఇంట్రెస్ట్ పెంచే విధంగా ఉంది. ఈసారి సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.



Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి