Dimple Hayathi: ఆ సాంగ్ కోసం 6 కేజీలు తగ్గాను.. అనుకోకుండా లాక్‌డౌన్ పడింది! హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!
Dimple Hayathi lost 6k weight: రవితేజ నటిస్తున్న తాజా సినిమా `ఖిలాడి` సినిమా కోసం హీరోయిన్ డింపుల్ హయతి ఏకంగా 6 కేజీలు తగ్గారట. 2నెలల పాటు తన బాడీని మెయిన్‌టైన్ చేయడానికి చాలా కష్టపడ్డారట.
Dimple Hayathi lost 6k weight for Khiladi Song: సినీ ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే అందంతో పాటు బాడీని మెయిన్‌టైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా హీరోయిన్‌లకు ఇది చాలా ముఖ్యం. సినిమా సినిమాకు కొందరు హీరోయిన్‌లు తమ వెయిట్‌ను పెంచాల్సి ఉంటుంది, మరికొందరికి తగ్గించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు 'ఖిలాడి' హీరోయిన్ డింపుల్ హయతి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమా ఖిలాడి ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో చిత్ర హీరో హీరోయిన్స్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'నా ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎవరో చూసి దర్శకుడుకి పంపారు. నాకు కథ నచ్చి ఒకే చెప్పా. రవితేజ గారు నా ఫొటో చూసి 'గద్దలకొండ గణేష్'లో సాంగ్ చేసింది ఈ అమ్మాయేనా అన్నారట. చాలా సంతోషం వేసింది. ఐటం సాంగ్ చేస్తే ఇకపై అలాంటివే వస్తాయని అనుకున్నా. ఆ తర్వాత చాలా సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. కానీ కొంత గ్యాప్ తీసుకుని నటిగా నిరూపించుకోవాలని మంచి సినిమా కోసం వెయిట్ చేశా. ఇప్పుడయితే ఐటం సాంగ్ లు చేయలేను. ఫ్యూచర్‌లో వస్తే ఆలోచిస్తా. లక్కీగా తొందరగానే రవితేజ సినిమాలో మంచి అవకాశం వచ్చింది. ఇందులో నేను భిన్నమైన మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామర్ రోల్ సాంగ్ చేశా. నటిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది అని చెప్పగలను' అని డింపుల్ హయతి తెలిపారు.
'సినిమా ఆరంభంలో రవితేజకు ఈక్వెల్ పాత్ర అంటే భయమేసింది. అలాంటి పాత్ర నాకు ఇస్తారా లేదా అన్న అనుమానం కలిగింది. సినిమా చేశాక నాకు దర్శకుడు చెప్పింది చెప్పినట్లు తీశారు. యాక్షన్ సీన్ తప్పితే సినిమా మొత్తం నా పాత్ర ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇంతకుముందు ఎప్పడూ రాలేదు. నేను ఖిలాడి సినిమా చేశాక సామాన్యుడు చేశాను. సామాన్యుడు షూటింగ్ లాకౌడ్‌న్‌లో 65 రోజులుల హైదరాబాద్‌లో చేశాను. నాకు డాన్స్ అంటే ఇష్టం. ఖిలాడిలో 'కేచ్ మి' సాంగ్ చేయడానికి ముందు లావుగా వున్నా. దర్శకుడు 6 కేజీలు తగ్గమన్నారు. తగ్గాక అనుకోకుండా లాక్‌డౌన్ వచ్చింది. షూటింగ్ వాయిదా పడింది. రెండు నెలల పాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయడానికి డైట్‌తో పాటు వ్యాయామం చేశాను. చాలా కష్టపడ్డా. చివరకు ఇటలీలో సాంగ్ చిత్రీకరణ పూర్తయింది' అని డింపుల్ హయతి
చెప్పారు.
Also Read: Cat vs Crow Fight: తెలివైన వ్యూహంతో పిల్లిని మోసం చేసిన కాకులు- వీడియో వైరల్
Also Read: Chocolate Day 2022: చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వారికి ఈ బహుమతులు ఇవ్వండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook