Chocolate Day 2022: వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7 నుంచే ప్రారంభమైంది. ఈ వారంలోని తొలి రోజును Rose Dayగా సెలబ్రేట్ చేసుకున్న ప్రేమికులు.. మూడో రోజున (ఫిబ్రవరి 9) చాక్లెట్ డే గా జరుపుకొంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే చాక్లెట్ తో తయారు చేసిన వస్తువులతో తాము ప్రేమించిన వ్యక్తులను సర్ ప్రైజ్ చేయడం సహా బహుమతులు ఇచ్చి వాళ్లను మెప్పిస్తారు. ఈ క్రమంలో చాక్లెట్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి ఇవ్వాల్సిన కొన్ని బహుమతుల నమూనాలను పరిశీలిద్దాం.
చాక్లెట్ డే బహుమతులు
1) చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వ్యక్తి చాక్లెట్ తో తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇస్తే వారు మరింతగా ఆనందిస్తారు. ఈ క్రమంలో చాక్లెట్స్ తో కూడిన బొకేతో సర్ ప్రైజ్ చేస్తే బాగుంటుంది.
2) అనేక రకాల చాక్లెట్స్ తో ఉన్న చాక్లెట్ బాక్స్ ను గిఫ్ట్ గా ఇవ్వడం సహా దానిపై ప్రత్యేక సందేశంతో పాటు దాన్ని అందజేస్తే.. మీరు ప్రేమించే వారి హృదయంలో అది చిరస్థాయిగా నిలిచిపోతుంది.
3) మీరు ప్రేమించే వ్యక్తికి టీ లేదా కాఫీ అంటే ఇష్టం ఉంటే.. కస్టమైజ్డ్ కాఫీ మగ్ పై మీ ప్రేమను వ్యక్తం చేస్తే బాగుంటుంది. ఇది పాత పద్ధతి అయినా.. దీన్ని నేటికీ చాలా మంది ప్రేమికులు ఇష్టపడుతున్నారు. వారు టీ లేదా కాఫీ తాగుతున్న ప్రతిసారి మిమ్మల్ని గుర్తుచేసుకుంటుంటారు.
4) చాక్లెట్ డే సందర్భంగా స్వయంగా మీ చేతులతో తయారు చేసిన చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వండి. ఎందుకంటే చాక్లెట్ అనేది కొత్త కాకపోయినా.. వారిపై ప్రేమతో మీరు స్వయంగా తయారు చేయడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మీరు ప్రేమించే వారికి మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో వారికి అర్థం అవుతుంది.
Also Read: Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!
Also Read: Valentine Week 2022: వాలెంటైన్ వీక్ లో తొలి రోజు Rose Dayగా ఎందుకు జరుపుకొంటారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook