Remo Dsouza Brother-in-Law Suicide : ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా బావ జాసన్ వాట్కిన్స్ (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని మిలత్ నగర్‌ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాట్కిన్స్... ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడవచ్చునన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్కిన్స్ (Jason Watkins) ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతని తల్లిదండ్రులు మెడిసిన్స్ కోసమని బయటకెళ్లగా... వారు తిరిగొచ్చేసరికే వాట్కిన్స్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యను మొదట తల్లిదండ్రులే గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుని వాట్కిన్స్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జాసన్ వాట్కిన్స్ ఆత్మహత్యపై ఒషివరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


జాసన్ వాట్కిన్స్ ఆత్మహత్యపై అతని భార్య లిజెలీ డిసౌజా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 'ఎందుకు నాకిలా చేశావ్... నేను నిన్నెప్పటికీ క్షమించను...' అని లిజెలీ తన పోస్టులో పేర్కొన్నారు. జాసన్ ఆత్మహత్యపై అతని బావ, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, రెమో డిసౌజా బాలీవుడ్‌లోని (Bollywood News) బెస్ట్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 1995 నుంచి ఇప్పటివరకూ ఎన్నో చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇదే క్రమంలో దర్శకుడిగా మారి ఏబీసీడీ, ఏబీసీడీ 2, రేస్ 3,  స్ట్రీట్ డ్యాన్సర్ తదితర చిత్రాలను తెరకెక్కించారు.


Also Read: Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇవాళ శుభవార్త వింటార


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook