Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇవాళ శుభవార్త వింటారు

Horoscope Today January 21 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమందికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధన నష్టం తప్పదు. అదే సమయంలో కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందుతాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 08:09 AM IST
  • నేటి రాశి ఫలాల్లో పలు రాశుల వారికి శుభవార్త వినే సమయం
  • కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి అనుకూల సమయం
  • కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిళ్లు, చికాకులు
Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇవాళ శుభవార్త వింటారు

Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తి అనుకూల సమయం. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.  

Aries - మేషం : మీ శక్తి, సామర్థ్యాలను ఎవరో వెలికితీయాలనే భావనలో ఉంటే.. దీర్ఘకాలం మీకు ఎదురుచూపులు తప్పవు. ఇవాళ మీ శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు అనువైన రోజు. బహుశా ఏదేని ఒక విషయంలో ఇవాళ మీరు శుభవార్త వింటారు. స్మార్ట్‌గా పనిచేయడం మొదలుపెడితే మీ ప్రత్యర్థులను అధిగమించి ముందుకెళ్లగలరు. 

Taurus - వృషభం : ఆర్థిక పరంగా, మీరు మీ ప్రణాళికలను వేగవంతం చేసే అవకాశం ఉంది. వాణిజ్యపరమైన పనులు పూర్తవుతాయి. మీ వృత్తిపరమైన పరిచయాలు బలపడతాయి. లాభాల్లో మరింత వృద్ది ఉంటుంది. మీ కృషి ఫలించి వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. మీ సామర్థ్యాలతో పాటు మీ ప్రతిభ కూడా వికసిస్తుంది. ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

Gemini - మిథునం : ఆత్మన్యూనత భావాన్ని విడనాడండి. నువ్వు సరిపోవు, సాధించాల్సింది ఇంకా ఉంది అనే విమర్శలను పాజిటివ్‌గా తీసుకోండి. సొంత నిర్ణయాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహాయ, సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు. అయితే ఆత్మన్యూనత భావంతో పనులు మొదలుపెడితే అవి పూర్తి చేయడం కష్టమనే విషయాన్ని గుర్తెరగాలి.

Cancer - కర్కాటకం : ఇవాళ అందరి పట్ల ప్రేమ, దైవ చింతనతో గడుపుతారు. ఏ విషయంలోనూ భయాలు వద్దు. అందరి పట్ల ప్రేమానురాగాలు మిమ్మల్ని సమాజానికి మరింత చేరువ చేస్తాయి. మీ సహృదయత అందరినీ కట్టిపడేస్తుంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇవాళ అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

Leo - సింహం: భావోద్వేగాల వలయంలో చిక్కుకుని అక్కడే ఆగిపోవద్దు. దాని నుంచి బయటపడేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. పరిస్థితిని ఉన్నత కోణం నుండి చూడటానికి ప్రయత్నించండి. రాబోయే వాటిపై దృష్టి పెట్టండి. సానుకూల మార్పులను మీరు త్వరలో చూడబోతున్నారు. మీరు అగాధంలో మునిగిపోతున్నట్లు అనిపించిన ప్రతిసారీ ధృఢమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగండి. 

Virgo - కన్య : మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధువులతో తగాదాలు మంచివి కాదు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపార రంగంలో కాస్త గందరగోళం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిళ్లు తప్పవు. 

Libra - తుల : చాలాకాలంగా కలవాలనుకుంటున్న మిత్రులను ఇవాళ కలుసుకుంటారు. ఒక విషయంలో శుభవార్తను వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. మీ  పలుకుబడి, ప్రతిష్ఠ మరింత పెరుగుతాయి. కీలక నిర్ణయాలు కుటుంబంలో చర్చించి ముందుకు వెళ్లండి.

Scorpio - వృశ్చికం : కొత్త పనులు మొదలుపెట్టేందుకు అనువైన సమయం. బంధుమిత్రులతో ఇవాళ ఎక్కువ సమయం గడిపే అవకాశం. కాంట్రాక్టర్లకు పూర్తి అనుకూల సమయం. పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందరిలోనూ  గౌరవం పెరుగుతుంది. 

Sagittarius - ధనుస్సు : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు. వ్యక్తిగత వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలతో చికాకు. కుటుంబసభ్యులతో తగాదాలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. అనుకోని రీతిలో ధన వ్యయం ఉంటుంది.

Capricorn - మకరం : ఒక శుభవార్త మిమ్మల్ని మానసికంగా ధృఢంగా మారుస్తుంది. నిజాయితీతో ముందుకెళ్తే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు కొంత ఇబ్బందిపెడుతాయి. శ్రమ అధికం. ధన నష్టం వచ్చే అవకాశం. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. 

Aquarius - కుంభం : మీ కుటుంబానికి ఇవాళ శుభవార్త అందుతుంది. చాలాకాలంగా పూర్తి కాని పని ఒకటి పూర్తవుతుంది. దైవ దర్శనానికి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్య వ్యవహారాలలో  విజయం చేకూరుతుంది. ధన లాభం చేకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూల సమయం.

Pisces - మీనం : అన్ని రంగాల్లోని వారికి అనుకూల సమయం. మీ పలుకుబడి, ప్రతిష్ఠ పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త పనులు మొదలుపెడుతారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. 

Also Read: 5G Networks, Flight Crashes: 5G నెట్‌వర్క్‌తో విమానాలు కూలిపోతాయా ? విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి ?

Also Read : Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్​ సెన్​..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News