Chiranjeevi angry : కుర్చీ విసిరేశాడట.. మీ బోడి అంటూ చిరు కోపం.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
Waltair Veerayya Success Meet వాల్తేరు వీరయ్య సినిమాకు రివ్యూలు, మౌత్ టాక్‌లు ఫుల్ పాజిటివ్‌గా వచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా వీకెండ్‌కు వీరయ్య మార్మోగిపోయింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.
Waltair Veerayya Success Meet మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలో క్లియర్ విన్నర్‌గా వాల్తేరు వీరయ్య దుమ్ములేపేస్తోంది. ఆల్రెడీ ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల క్లబ్బులో జాయిన్ అయిపోయింది. నేడు జరిగిన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో చిరంజీవి గురించి బాబీ చెబుతూ అందరినీ టచ్ చేసేశాడు. చిరంజీవికి ఓ సినిమా షూటింగ్ సమయంలో కోపం వచ్చిందంటూ నాటి విషయాలను పంచుకున్నాడు.
నిర్మాతకు నష్టం వచ్చే పని, సినిమాకు సంబంధించిన విషయాలు ఆయనకు చెప్పకపోతే కోపం వస్తుంది.. వేరే సినిమా షూటింగ్ సమయంలో ఆయనలో ఉన్న శివుడ్ని నేను చూశాను. ఆయనకు కూడా కోపం వస్తుందా? అని ఆరోజు నాకు తెలిసింది.. షాట్‌కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. చెయిర్ విసిరేసి.. ఈ బోడి పర్ఫామెన్స్ నా దగ్గర వద్దు.. నేను ఇక్కడ తినే ఇడ్లీ కన్నా అక్కడ షాట్ ఇంపార్టెంట్ అంటూ కుర్చీ విసిరేసి వెళ్తున్న చిరంజీవి గారిని చూసి.. సినిమాకు ఇబ్బంది కలిగితేనే ఈయనకు కోపం వస్తుందని నాకు అర్థమైంది.
అలాంటి సంఘటన మళ్లీ కాకూడదని ప్రయత్నించా. పీటర్ హెయిన్ మాస్టర్ ఊరెళ్తానని అంటున్నారు.. ఓ మూడు గంటలు మీరు వస్తే ఆ సీక్వెన్స్ తీద్దాం అన్నయ్య అని ఫోన్‌లో చెబుతున్నాను.. దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. కరెక్ట్‌గా చెప్పు నాకు అర్థం అవ్వడం లేదు అని చిరంజీవి గారు అన్నారు. ఏం లేదు అన్నయ్య మీరు రేపు ఓ మూడు గంటలు వస్తే.. మీ పోర్షన్ కంప్లీట్ చేస్తాను.. మళ్లీ సెట్ ఎందుకు ఇలా ఉందని మీరు అడగొద్దు కదా? అందుకే ముందే చెబుతున్నాను.. రేపు సాంగ్ షూట్‌లో కాస్త గ్యాప్ చూసి మీరు వస్తే సీన్ తీసేద్దామన్నయ్యా అని చెప్పాను.
ఇంతే కదా? రేపు వస్తాను.. అంత వరకు గ్యాప్ లేకుండా రవితో షూటింగ్ చేసుకో. నేను కారులోనే లంచ్ చేసి డైరెక్ట్‌గా సెట్‌కు వస్తాను.. మూడు గంటలే అని కాదు.. షాట్ కరెక్ట్‌గా వచ్చే వరకు తీసుకో అని అన్నారు.. అలా అంతగా కష్టపడ్డారు.. అలా కష్టపడితే సక్సెస్ ఎందుకు రాదు.. స్టార్డం ఎందుకు రాదు.. అంటూ చిరు గురించి చెబుతూ బాబీ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook