Ramya Krishnan Krishna vamsi Divorce రమ్యకృష్ణ, కృష్ణవంశీల ప్రేమ కథ అందరికీ తెలిసిందే. చంద్రలేఖ సమయంలోనే వీరి ప్రేమ చిగురించిందట. అయితే రమ్యకృష్ణ ఎప్పుడూ చెన్నైలోనే ఉంటుంది. కృష్ణవంశీ ఇక్కడే తన సినిమా పనులతో బిజీగా ఉంటుంటాడు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారని, అందుకే ఇలా విడివిడిగా ఉంటున్నాడని రూమర్లు వస్తుంటాయి. అయితే తాజాగా కృష్ణవంశీ జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడుతూ అసలు విషయాన్ని మరోసారి బయటపెట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కృష్ణవంశీ మీడియా ముందుకు వస్తున్నాడు. అయితే ఈ మధ్యే రంగమార్తాండ నుంచి నేనొక నటుడ్ని అంటూ శాయరీని విడుదల చేశారు. చిరంజీవి గొంతులో వినిపించిన నేనొక నటుడ్ని అందరినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా రంగమార్తాండ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


అసలు ఈ సినిమా మొదలు కావడానికి కారణం ప్రకాష్‌ రాజ్ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. నువ్ చేస్తే బాగుంటుందని ప్రకాష్‌ రాజ్‌కు నానా పటేకర్ సలహా ఇచ్చాడట. దీంతో తానే హీరోగా నటించి, దర్శకత్వం వహించుకుందామని అనుకున్నాడట. కానీ తన చేతిలోకి తెచ్చి పెట్టానని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా కోసం బడ్జెట్ పెరిగిందట. కానీ రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్, తాను అందరం కలిసి బడ్జెట్‌ను కంట్రోల్ పెట్టేశామని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.


ఇదే క్రమంలో రమ్యకృష్ణతో విడాకుల రూమర్ల మీద కూడా స్పందించాడు. అలాంటి రూమర్లు వ్యాప్తి చేయడం శాడిస్టిక్ థింగ్స్, శాడిస్టిక్ పనులు.. అలాంటి వారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది.. అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోతోన్నారనిపిస్తుంది.. ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదు.. అని కృష్ణవంశీ కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పుకొచ్చాడు.


Also Read: Rashmika Mandanna : కిరిక్ పార్టీ సినిమాపై పోస్ట్.. అందుకే అలా చేసిందా?


Also Read: Hyper Aadi : సద్దాంతో గొడవలు.. స్టేజ్ మీదే అలాంటి కామెంట్లు చేసిన హైపర్ ఆది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి