Hyper Aadi Saddam Issue హైపర్ ఆది, సద్దాంలు బుల్లితెరపై పోటాపోటీగా స్కిట్లలో రచ్చ చేస్తుంటారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆది జబర్దస్త్ షోలో ఉండగా.. సద్దాం అదిరింది, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ పాయింట్ దగ్గర ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. యూట్యూబ్‌లో తనకే ఎక్కువగా ఫాలోయింగ్ ఉందని, తన స్కిట్లే వైరల్ అవుతుంటాయని సద్దాం అన్నట్టుగా ఉన్నాడు.
తనవి ఎన్నో స్కిట్లు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేశాయని సద్దాంను తక్కువ చేసినట్టుగా ఆది మాట్లాడాడు. అలా ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరు జరుగుతూనే ఉండేది. అయితే ఇప్పుడు సద్దాం మళ్లీ మల్లెమాల టీంలోకి వచ్చాడు. ముందు పటాస్ షోతోనే సద్దాం ఫేమస్ అయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి