Rashmika Mandanna : కిరిక్ పార్టీ సినిమాపై పోస్ట్.. అందుకే అలా చేసిందా?

Kirik Party Completed Six Years రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. తన మొదటి కన్నడ సినిమా కిరిక్ పార్టీతో రష్మిక మందన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా మీద రష్మిక పోస్ట్ వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 04:51 PM IST
  • నటిగా రష్మికకు ఆరేళ్లు
  • వివాదాల్లోకి రష్మిక మందన
  • కిరిక్ పార్టీపై రష్మిక పోస్ట్
Rashmika Mandanna : కిరిక్ పార్టీ సినిమాపై పోస్ట్.. అందుకే అలా చేసిందా?

Rashmika Mandanna Completed Six Years రష్మిక మందన కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతోనే ఫేమస్ అయింది. రక్షిత్ శెట్టి హీరోగా, నిర్మాతగా.. రిషభ్ శెట్టి దర్శకుడిగా వచ్చిన ఈ చిత్రంతో రష్మిక ఇమేజ్ మారిపోయింది. ఈ సినిమా సమయంలోనే రష్మిక, రక్షిత్‌ శెట్టిలు ప్రేమలో పడిపోయారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ తెలుగులో ఛలో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. తన పూర్తి ఫోకస్ సినిమాల మీద పెట్టాలని ఫిక్స్ అయింది. అందుకే రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది.

దీంతో రష్మిక మీద కన్నడ జనాలు భగ్గుమన్నారు. ప్రేమించిన వాడిని ఇలా మోసం చేస్తావా? ఒక్క సినిమా హిట్ అయితే ఇలా వదిలేస్తావా? అంటూ రష్మిక మీద అక్కడి జనాలకు నెగెటివిటీ ఏర్పడింది. అది ఇప్పటికీ అలానే ఉంది. అయితే రక్షిత్ శెట్టి మాత్రం రష్మికను ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా వెటకారంగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ రష్మిక మాత్రం పలు సందర్భాల్లో కిరిక్ పార్టీ సినిమాను, రక్షిత్ శెట్టిని విమర్శిస్తూ మాటలు మాట్లాడింది.

కాంతారా సినిమాను చూడలేదని చెప్పడంతో కన్నడిగులు భగ్గుమన్నారు. తన మొదటి ప్రొడక్షన్, కెరీర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు కూడా చెప్పుకోలేకపోతోందని రష్మికను ఆడుకున్నారు. అయితే ఇప్పుడు వీటిని కాస్త మరిచిపోయేలా చేసేందుకు రష్మిక ట్రై చేస్తున్నట్టుగా ఉంది. కిరిక్ పార్టీ సినిమా వచ్చిన ఆరేళ్లు అవుతోందని, తనకు నటిగా ఆరేళ్లు నిండాయంటూ రష్మిక ఓ పోస్ట్ వేసింది.

దీంతో రష్మిక కావాలనే ఇలా పోస్ట్ చేసిందని, కన్నడిగులు కాస్త అయినా తన మీద కోపాన్ని తగ్గించుకుంటారేమో అని ఇలా చేసిదంటూ టాక్ వినిపిస్తోంది. రష్మిక ప్రస్తుతం వారసుడు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగనుంది. తమిళ, తెలుగు భాషల్లో రష్మిక సందడి ఎలా ఉండబోతోందో, విజయ్ రష్మిక కాంబోలో సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News