Director Puri Jagannadh Fires On Exhibitors Dharna: పూరి జగన్నాథ్ ఎగ్జిబిటర్లను ఉద్దేశించి విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా లైగర్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేశారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో భారీ ఎత్తున సినిమా కొన్న వాళ్ళందరూ నష్టపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులన్నీ వరంగల్ శీను అనే డిస్ట్రిబ్యూటర్ దక్కించుకున్నారు. ఆయన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు సినిమా కొనుక్కుని ప్రదర్శించారు. కానీ ఆ సినిమాకి భారీగా ఎగ్జిబిటర్లు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పూరి జగన్నాథ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన వారి నష్టాలను కొంతమేర తాను భర్తీ చేసే ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారట.


అయితే ఇప్పుడు నెల రోజులు తర్వాత తాను ఇస్తానంటే వినకుండా ఇప్పటికే ఇప్పుడు ఇవ్వకపోతే అక్టోబర్ 27 నుంచి పూరీ నివాసం ముందు ధర్నాకు దిగుతామంటూ ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిని హెచ్చరిస్తూ పూరి జగన్నాథ్ ఒక వాయిస్ నోట్ విడుదల చేశారు. అసలు తాను ఇవ్వాల్సిన బాధ్యత తనకు లేదు కానీ ఇస్తున్నాను అంటే వాళ్లు కూడా నష్టపోయారు అనే ఉద్దేశంతో ఇస్తాను అన్నాను, అలా  అన్నప్పుడు కూడా మాట వినకుండా ఇలా ఎదురు తిరిగితే అలా చిరాకు వస్తుందని, ఇవ్వాలని కూడా అనిపించిందని ఆయన అన్నారు.


అంతేకాదు ధర్నా చేస్తా అన్నారు కదా చేయనివ్వండి, వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్లకు తప్ప మిగతా వాళ్ళకి ఇస్తాను అంటూ పూరి జగన్నాథ్ పేర్కొన్నట్టుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో సినిమా చేసిన తర్వాత నిర్మాతలు ఆ సినిమాని తమ సొంతంగా విడుదల చేసుకుంటారు. లేదా డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు. సొంతంగా విడుదల చేసుకున్నప్పుడు ప్రాంతాలవారీగా థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ యజమానులతో మాట్లాడి ఒక రేటు ఫిక్స్ చేసుకొని వారికి సినిమా ఇస్తారు.


లేదు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గనుక రిలీజ్ చేస్తే టోకున ఒక అమౌంట్ కు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తారు. ఆ తరువాత అన్నీ ఆ డిస్ట్రిబ్యూటర్ చూసుకోవాలి. ఉదాహరణకు కృష్ణాజిల్లా మొత్తం ఐదు కోట్ల రూపాయలకు ఒక డిస్ట్రిబ్యూటర్ కి అమ్మి వేస్తే సదరు డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాని ఎంత లాభానికైనా ఎగ్జిబిటర్లకు సినిమా మార్కెట్ బట్టి అమ్ముకోవచ్చు.సినిమా బాగుంటే కచ్చితంగా డిస్టిబ్యూటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి అలాగే ఎగ్జిబిటర్లకి కూడా మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ సినిమా ఇబ్బంది పడితే ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రావాల్సిన డబ్బులు కూడా ఒక్కో సారి ఆగిపోతాయి.


అలాంటి సమయంలో నిర్మాతలు జోక్యం చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఒక రకమైన వ్యాపారమే అయినా తమ గుడ్విల్ కోసం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇలా నేరుగా ఎగ్జిబిటర్లు తాము నష్టపోయాం కాబట్టి ఇప్పుడు తమకు న్యాయం చేయాలని పూరీ జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతారనడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయి ఉండి మంచి లాభాలు వస్తే వారు పూరీ జగన్నాధ్ కు ఆ లాభాల్లో షేర్ చేయరు కదా.. ఇప్పుడు నష్టాలూ రావడంతో ఇలా అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.  


Also Read: Kantara New Record: కాంతార కొత్త రికార్డు.. కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన సినిమా ఇదే!


Also Read: Mahesh Love: మహేష్ బాబు ప్రేమ గురించి ఎవరికీ తెలియని నిజాలు బయటపెట్టిన మంజుల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook