Ram Gopal Verma Arrest: 'ఒక సెక్షన్ మీడియా సంస్థలు నన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వర్మ భయపడి పారిపోయాడు అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. నేను చేసిన తప్పేమిటి? ఏ సెక్షన్‌లో అరెస్ట్‌ చేస్తున్నారో పోలీసులు చెప్పకముందే మీడియా నానా హడావుడి చేస్తున్నాయి' అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది? అని తెలిపారు. అంత ఎందుకు ఆసక్తి అంటూ ప్రశ్నించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి


 


తనపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు.. అరెస్ట్‌ అంటూ హైడ్రామా నడుస్తుండడంపై రామ్‌ గోపాల్‌ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన కీలక అంశాలపై స్పందించారు. తన అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని.. తనపై నమోదైన కేసులు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని తెలిపారు. ఈ అనుమానంతోనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..! .. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..


 


'వ్యంగ్యం అనేది మీడియా సహా ప్రతి చోటా ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వందలాది మీమ్స్ కనిపిస్తాయి. నేను ఏడాది కిందట చేసిన పోస్ట్ కూడా అలాంటిదే' అని రామ్‌ గోపాల్‌ వర్మ స్పష్టం చేశారు. 'ఏడాది తర్వాత ఒక వ్యక్తి మేలుకుని నాపై ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత ఈ ఒకే పోస్ట్‌ను కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి' అని వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదనే అనుమానంతో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంతవరకు పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఎక్కడా ప్రకటించలేదని గుర్తుచేశారు.


'ఒక సెక్షన్ మీడియా సంస్థలు వర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వర్మ భయపడి పారిపోయాడు' అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నట్లు దర్శకుడు ఆర్జీవీ తెలిపారు. 'తొలిసారి పోలీసులు సంప్రదించినప్పుడు నేను అందుబాటులో లేను. రెండోసారి కూడా ఇంకాస్త సమయం కావాలని అడిగా. కావాలంటే వర్చువల్ గా వీడియోలో మీతో మాట్లాడుతాను అని చెప్పాను' అని ఆర్జీవి వివరించారు. 'సెన్సార్‌ ఇబ్బందుల వలన నేను పొలిటికల్ మూవీస్ మానేస్తా అని చెప్పా. ఏడాది పాటు ఆ సెన్సార్ కోసం వెయిట్ చేయడం చిరాకుగా ఉండి పొలిటికల్ బేస్డ్ మూవీస్ తీయను అని చెప్పా' అంటూ ప్రకటించారు.


'నేను చేసిన పోస్ట్‌లో అర్థం మీకు ఒకలా.. నాకు ఒకలా కనిపించవచ్చు. అది ఎవరి వ్యక్తిగత దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. నేను చేసిన తప్పేంటో, ఏ సెక్షన్‌లో అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పకముందే కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయి' అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల తీరుపై ఆర్జీవీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తన కేసుల విషయమై న్యాయపరంగా ముందుకు పోతామని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.