Big relief for ram gopal varma vyuham controversy case: రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఆయనపై ఇప్పటి వరకు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు రావడం ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. గతంలో ఆయన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆమన సతీమణిపై వివాదాస్పందంగా పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
దీనిపై ఇటీవల కొంత మంది టీడీపీ నేతలు ఏపీలోని వివిధ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లలలో ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తొంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు.. హైదరబాద్ లోకి ఆర్జీవీ ఇంటికి రాగా.. అప్పుడు ఆయన అందుబాటులో లేరని ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్జీవీ మాత్రం.. తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని ఒకసారి.. తన ఇంట్లోనే ఉన్నానని.. కూడా చెప్పారు.
మరొవైపు ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు.. క్వాష్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఆయన ప్రధానంగా.. తనపై వచ్చిన ఆరోపణలపై తనదైన స్టైల్ లో స్పందించారు. ఎప్పుడో.. ఏడాది క్రితం తాను.. పోస్టులు పెడితే.. దానిపై ఇప్పుడు రాద్ధాంతం ఏంటని మండిపడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. పెట్టిన వాళ్లుస్పందించకుండా..మరేవరో కేసులు పెట్టడంపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆర్జీవీ వ్యాఖ్యలుచేశారు.
తను ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నానని.. కావాలంటే.. ఆన్ లైన్ లో పోలీసుల ఎదుట హజరు అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. కానీ.. పోలీసులు మాత్రం.. ఇలా డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు రావడం ఏంటని ప్రశ్నించారు. తన లాయర్ తో పలు మార్లు రిక్వెస్ట్ లెటర్ పంపించిన విషయాల్ని సైతం గుర్తుచేశారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ఆర్జీవి వేసిన బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు మాత్రం ఆర్జీవీకి స్వల్పంగా రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణను డిసెంబరు 9 వరకూ వాయిదా వేసింది. అదే విధంగా..అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్జీవీకి మాత్రం ఇది కాస్తంత రిలీఫ్ ను ఇచ్చే అంశంగా భావించవచ్చని నెటిజన్లు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.