Shankar-Vijay Combo: రిపీట్ కానున్న దళపతి విజయ్ - డైరెక్టర్ కాంబో..!
తమిళ హీరో - లోకేష్ కానగరాజ్ కాంబోలో `లియో` సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఏ ఈ సినిమా తరువాత హీరో దళపతి విజయ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రానున్నదని ప్రచారం. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంతో రానుందని సమాచారం. ఆ వివరాలు..
Shankar-Vijay Combo: తమిళ హీరో విజయ్ గురించి మన అందరికీ తెలిసిందే! దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తనకు అభిమానులు ఉన్నారు. దళపతి విజయ్ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు. మారు వేషాల్లో వెళ్లి తమిళనాడు మొత్తం తిరిగి వస్తుంటారు. ఇక ఈ స్టార్ హీరో సినిమాల విషయానికి వస్తే.. బీస్ట్ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో నడవకపోయినప్పటికీ తమిళంలో కాస్త వసూళ్ళని రాబట్టింది.
ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకర్వంలో తెరకెక్కిన వారసుడు సినిమా.. తెలుగులో ఆశించిన స్థాయిలో లేనపప్పటికీ, తమిళ్ లో మాత్రం మంచి విజయం సాధించింది. ఇక దళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న సినిమా 'లియో'. మొన్నీ మధ్యే ఈ సినిమా పోస్టర్ విడుదల అవ్వగా.. మంచి రెస్పాన్స్ తో పాటు.. పోస్టర్ ఒక ఇంగ్లీష్ సినిమా కాపీ కొట్టినట్టు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు అభిమానుల ముందుకు రానుంది.
ఇక దళపతి విజయ్ రాజకీయాల ఆరంగేట్రం విషయానికి వస్తే.. త్వరలో రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య టెన్త్, ఇంటర్ మెరుగైన పలితాలు సాధించిన వారిని దళపతి విజయ్ తన కార్యాలయానికి పిలిపించి.. సన్మానించారు. అంతేకాకుండా, ఎలక్షన్ ల సమయాల్లో ఓటుకు డబ్బులు తీసుకోకుండదు అని సూచించారట. వీటితో పాటుగా ప్రభుత్వ పని తీరును అభిమాన సంఘాలను అడిగి మరీ తెలుసుకున్నారట! ఇక ఈ విషయం బయటకి పొక్కటంతో దళపతి విజయ్ భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని తమిళ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Sai Dharam Tej About Politics: రాజకీయాలపై సింపుల్‌గా తేల్చిపడేసిన సాయిధరమ్ తేజ్
దళపతి విజయ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే వీద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ - రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేయబోతున్న సంగతి తేలింసిందే! అయితే కమల్ తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాకి బ్రేక్ పాసైన సంగతి కూడా తెలిసిందే! శంకర్- విజయ్ కాంబో లో రాబోతున్న సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం.
Also Read: Rashmika Mandanna:‘'బేబీ'’ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి