Prema Desam Movie : అందుకే మధుబాలను తీసుకున్నాం.. ప్రేమదేశంపై దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం
Srikanth Siddham Prema Desam త్రిగున్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల నటిస్తోంది. ఈ మూవీని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Prema Desam Movie తెలుగులో ప్రేమ దేశం టైటిల్‌కు ఓ హిస్టరీ ఉంటుంది. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా కూడా ప్రేమ దేశం ఇక్కడ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ టైటిల్‌తో మళ్లీ ఓ సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 3న ప్రేమదేశం సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీని సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ సిద్దం నిర్మిస్తూ తెరకెక్కిస్తుండగా.. త్రిగున్ , మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటించింది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం మీడియాతో ముచ్చట్లు పెడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. బీటెక్ చదివి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా సినిమాల మీద ప్యాషన్‌తో తిరిగి వచ్చాడట శ్రీకాంత్. షార్ట్ ఫిలిం తీసిన తరువాత పెద్ద తెరపై ఓ ప్రేమ కథను తీయాలని అనుకున్నాడట. అదే ప్రేమ దేశంగా మారిందట.
ఇందులో తల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన వారితో చేస్తే రొటీన్‌గా అనిపిస్తుందని అనుకున్నాడట. అందుకే కొంత ఫ్రెష్ నెస్‌తో పాటుగా కాస్త బబ్లినెస్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మధుబాలను తీసుకున్నట్టుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు.
తనికెళ్ల భరణి కూడా ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నాడట. ఈ చిత్రంలో ఎక్కువగా తల్లీ,కొడుకుల బంధాన్ని చూపించారట. త్రిగున్ , మేఘా ఆకాష్ జంట జనాలను ఆకట్టుకుంటుందట. మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా సహజంగా నటించారని డైరెక్టర్ కొనియాడాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌ను చాలా కేర్ తీసుకొని చేయడంతో యూత్‌ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కథ మీద మాకు ఉన్న నమ్మకం, అలాగే మణి శర్మ మీద ఉన్న విశ్వాసమే జనాలను థియేటర్లకు రప్పిస్తుందని దర్శకుడు అన్నాడు.
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook