నెరవేరిన సుక్కూ కల.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న లెక్కల మాష్టారు.. ట్విస్ట్ ఏంటంటే...
Sukumar Chiranjeevi Combination: దర్శకుడు సుకుమార్ త్వరలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు.. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..
Sukumar Chiranjeevi Combination: దర్శకుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. త్వరలో మెగాస్టార్ కోసం మెగా ఫోన్ పట్టబోతున్నానని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... సుకుమార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోయేది ఓ యాడ్ ఫిలిం కోసమని చెబుతున్నారు.
చిరును డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. అది సినిమానా యాడ్ ఫిలిమా అన్న విషయంలో సుక్కూ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చాలామంది నెటిజన్లు ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయిందని భావించి ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో అది సినిమా కాదు.. యాడ్ ఫిలిం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చిరుతో ప్రాజెక్ట్ విషయంలో సుక్కూ అందరినీ సస్పెన్స్‌లో పెట్టేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిరు చేతిలో భోళా శంకర్, గాడ్ ఫాదర్‌తో పాటు బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఒకవేళ సుక్కూతో సినిమా ఓకె అయినా.. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యే అది పట్టాలెక్కుతుంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలుకానుంది. పుష్ప ది రైజ్‌కి కేవలం తెలుగులోనే కాదు సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప పాటలు, అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.200 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది.
Also Read: Purchased Land On Moon: చంద్రుడిపై భూమి కొనేశాడు.. చౌక భేరం.. ఎకరం 6 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook