Multiplex Popcorn Rates kills Cinema ఇప్పుడు ఓ ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిందే. పెద్ద సినిమా అయితే టికెట్ రేట్ దాదాపు మూడు వందలకు దగ్గర్లో ఉంటుంది. టికెట్ రేట్లను ఇలా పెంచుకోడం ఇప్పుడు పరిపాటిగా మారింది. టికెట్ రేట్ల పెంపు ఇలా ఉంటే.. మల్టీప్లెక్సుల్లో దోపిడి ఇంకోలా ఉంటుంది. కూల్ డ్రింక్‌కు మూడొందలు నాలుగొందలుంటుంది. పాప్ కార్న్‌కు ఐదు వందల దాక ఉంటుంది. ఇలా ఓ ఫ్యామిలీ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేసి రావాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆడియెన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కదా? ఇంట్లోనే హాయిగా చూడొచ్చని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే టాపిక్ మీద డైరెక్టర్ తేజ మాట్లాడాడు. గోపీచంద్ రామబాణం సినిమా ప్రమోషన్స్‌ కోసం తేజ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో తేజ మల్టీప్లెక్సుల దోపిడి మీద స్పందించాడు.


కరోనా తరువాత ఆడియెన్స్ టేస్ట్ మారిపోయిందా?.. జనాలు థియేటర్లకు రావడం లేదా?.. అని గోపీచంద్ ప్రశ్నించాడు. దీనికి తేజ ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పాడు. ఓటీటీ అయినా, యూట్యూబ్ అయినా, ఫోన్ అయినా కూడా థియేటర్లో చూస్తే వచ్చే అనుభూతిని ఇవ్వలేదు.. థియేటర్లో చూస్తే కలిగే అనుభూతి వేరు అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్


అయితే మల్టీ ప్లెక్సులోని పాప్ కార్న్ రేట్ మాత్రం సినిమాను చంపేస్తుంది అని అన్నాడు. టికెట్ రేట్ల కంటే ఎక్కువగా పాప్ కార్న్ రేట్ ఉంటుందని, అవి కొనలేక.. సామాన్యుడు మల్టీప్లెక్సుల్లోకి రావడం లేదని, అయినా మల్టీప్లెక్సులో స్క్రీన్ సైజ్ తగ్గుతోందని, అందుకే అందరూ సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలు చూడండని సలహా ఇచ్చాడు.


ఇప్పుడు హిందీ సినిమాలు చనిపోవడానికి కారణం మల్టీపెక్సుల దోపీడే అని అన్నాడు. మల్టీప్లెక్సులు ఎక్కడ ఉంటే.. అక్కడ సినిమా చచ్చిపోతుందని క్లియర్ కట్‌గా తేజ చెప్పుకొచ్చాడు. మరి ఈ పాప్ కార్న్, కూల్ డ్రింగ్స్ రేట్లను ప్రభుత్వాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.


Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook