Govt Junior College Punganur-500143 Teaser: యధార్థ సంఘటనను స్పూర్తిగా తీసుకుని.. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 అనే మూవీ తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవ కథకు తెర రూపమిస్తూ.. ఆద్యాంతం ఆకట్టుకునేలా మలిచినట్లు చెబుతున్నారు మూవీ మేకర్స్. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీని థీమ్‌గా తీసుకుని రూపొందిస్ఉతన్న  ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా సందర్భంగా టీజర్‌ను మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ తన సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజిక్ అండ్ సినిమా ఫ్రేమింగ్ చాలా బాగుంటుందని.. అందరూ కొత్త వారే నటించినా చాలా న్యాచురల్‌గా యాక్ట్‌ చేశారని మెచ్చుకున్నారు. టీనేజ్ లవ్ స్టోరీలో ఉండాల్సిన ఇన్నోసెన్సీ ఇందులో చూపించామని తెలిపారు.


ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 సినిమా కచ్చితంగా యువతకి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ టీమ్ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసి సినిమా మంచి విజయం సాధించాలని త్రివిక్రమ్  కోరుకున్నారని వారు తెలిపారు. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. కొవ్వూరి అరుణ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ మ్యూజిక్ అందించారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించగా.. ఎడిటింగ్ బాధ్యతలను కోదాటి పవన్ కళ్యాణ్ నిర్వర్తించారు. 


Also Read: Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్


Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.