Jithender Reddy First Look: ఉయ్యాల జంపాల, మజ్ను వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ విరించి వర్మ. ఏడేళ్ల గ్యాప్ తరువాత ఆయన మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్న మూవీ జితేందర్ రెడ్డి. అసలు ఎవరు ఈ 'జితేందర్‌ రెడ్డి'..? ఏంటి ఈ కథ అంటే.. సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా 'జితేందర్‌ రెడ్డి' ఇచ్చిన హామీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతో అసలు ఎవరు ఈ 'జితేందర్‌ రెడ్డి' అని తీసుకోవాలనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు మూవీ మేకర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జితేందర్‌ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ.. 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో 'జితేందర్‌ రెడ్డి'గా నటించింది ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ నెల 21న ఆగాల్సిందే. ఆ రోజు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ కెమెరామెన్‌ పని చేస్తున్నారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


1980 బ్యాక్‌డ్రాప్‌ జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా టైటిల్ పోస్టర్‌ను డైరక్టర్ దేవకట్టా  విడుదల చేశారు. తెలంగాణ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. సీరియస్ యాక్షన్ డ్రామా కథగా సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఉయ్యాల జంపాలతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ.. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ద్వారానే రాజ్ తరుణ్, అవికా గోర్ బిగ్ స్క్రీన్స్‌పై మెరిశారు. నాని-అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన మజ్ను చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తరువాత సరికొత్త స్టోరీ లైన్‌తో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు విరించి వర్మ. 


Also Read: IND Vs SL Asia Cup 2023: ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. నిప్పులు చెరిగిన సిరాజ్.. తోకమూడిచిన శ్రీలంక బ్యాట్స్‌మెన్  


Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook