Disha Rape Incident: సల్మాన్, అక్షయ్, రకుల్, రవితేజ..సహా 38 మందిపై కేసు నమోదు! అసలేం జరిగిందంటే...
Disha: బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ పై తాజాగా కేసు నమోదు అయింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల డ్రగ్స్ కేస్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ నటులను విచారించిన సంగతి తెలిసిందే.
Disha Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటన అందరికీ గుర్తు ఉంటుంది. ఈ కేసు విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన రవితేజ(Raviteja), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preetsingh).. బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్(Salman Khan), అక్షయ్ కుమార్(Akshay Kumar) సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలను అరెస్ట్ చేయాలంటూ కేసు ఫైల్ అయ్యింది.
అసలేం జరిగిందంటే..
నవంబర్ 27, 2019న హైదరాబాద్(Hyderabad)లో ఓ యువతిని నలుగురు కిరాతకులు అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. బాధిత యువతి కుటుంబానికి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆమెను దిశ(Disha) అనే పేరుతో సంభోదించారు. ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు అసలు పేర్లను ఉపయోగించకుండా మారు పేర్లను పెడుతుంటారు. అయితే దిశ ఘటన(Disha incident) జరిగినప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె ఒరిజినల్ నేమ్ ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్, సల్మాన్‌ఖాన్ సహా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి బాధిత అమ్మాయి పేరుని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు.
Also Read: Tollywood Drug Case: రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించిన ఈడీ.. ఏం ప్రశ్నలు అడిగిందంటే..?? ఫోటోస్
ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు అనుసరించిన విధానం సరిగా లేదంటూ ఢిల్లీ(Delhi)కి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది సబ్జీ మండీలోని పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 228 ఏ కింద కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)ను డ్రగ్స్ కేసు(Drugs case) పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త కేసు వ్యవహారం చర్చనీయాంశమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook