శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ ప్రశ్నల వర్షం కురిపించిందనే విషయం అందరికి తెలిసిందే.. రకుల్ ప్రీత్ సింగ్ విచారణ తరువాత బయటపడ్డ కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tolywood Drug Case) మళ్లీ కలకలం రేపింది, రానా దగ్గుబాటి (Rana Daggubati), పూరీ జగన్నాథ్ (Puri Jagannath), హీరోయిన్ చార్మీ (Charmi Kaur), రకుల్ (Rakul Preet Singh) తో పాటు పూర్తిగా 12 మందిని ఈడీ విచారించనుంది. ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీ, రకుల్ విచారణ పూర్తయింది. (Pic Courtesy: Instagram/Rakul Preet Singh)
శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ (Enforcement Directorate) ప్రశ్నించింది. నటుడు నవదీప్ (Navdeep)కి చెందిన ఎఫ్-క్లబ్ పబ్ (F-Club Pub) కు రకుల్ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందట...ప్రధాన నిందితుడు కెల్విన్‌తో (Kelvin) వాట్సాప్ చాటింగ్‌లో ఆమె ఆర్థిక లావాదేవీల పైన విచారణ జరిగినట్లు తెలుస్తుంది. (Pic Courtesy: Instagram/Rakul Preet Singh)
శుక్రవారం ఉదయం 10.30 గం.లకు ఈడీ కార్యాలయానికి (Enforcement Directorate Office) రావాల్సి ఉండగా.. రకుల్ అక్కడికి తొమ్మిదింటికే వ్యక్తిగత లాయర్, అకౌంటెంట్ తో వచ్చారు. (Pic Courtesy: Instagram/Rakul Preet Singh)
ఉదయం 10.30 గం.లకు ప్రారంభమైన విచారణ దాదాపు 8 గంటల వరకు కొనసాగింది. తరువాత సాయంత్రం 4.30 గంటలకు విచారణ పూర్తవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి వెళ్లిపోయారు. (Pic Courtesy: Instagram/Rakul Preet Singh)
దాదాపు విచారణ మొత్తం రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలతో పాటు, తన ఫిట్‌నెస్ సెంటర్ ఖాతాల స్టేట్‌మెంట్లను ఈడీ చెక్ చేసింది. అయితే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ఎవరో తెలియదని.. అతనిని ఎపుడు కలవలేదని రకుల్ చెప్పినట్లు తెలుసుస్తుంది. (Pic Courtesy: Instagram/Rakul Preet Singh)
2016లో నవదీప్ కు చెందిన ఎఫ్-క్లబ్‌లో పార్టీ ఉంటే వెళ్ళినపుడు కెల్విన్ తో పరిచయం ఏర్పడిందని.. తరువాత గంటల వ్యవదిలోనే రకుల్ ఖాతా నుండి డబ్బు బదిలీ జరిగిందని, కెల్విన్ ఆ మొత్తాన్ని ఆఫ్రికా దేశానికి (Africa) పంపాడని ఈడీ గుర్తించింది. Pic Courtesy: Instagram
గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణం తరువాత అదే నెలలో రకుల్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబాయి లో విచారించింది. Pic Courtesy: Instagram