MAA Elections 2021: మా ఎన్నికల్లో వర్గపోరు, బండ్ల గణేశ్ వర్సెస్ జీవితా రాజశేఖర్

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2021, 04:59 PM IST
  • మా ఎన్నికల్లో వర్గపోరు బహిర్గతం, బండ్ల గణేష్ వర్సెస్ జీవితా రాజశేఖర్
  • జీవితా రాజశేఖర్‌కు పోటీగా బరిలో దిగుతున్న బండ్ల గణేష్
  • టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మా ఎన్నికలు
MAA Elections 2021: మా ఎన్నికల్లో వర్గపోరు, బండ్ల గణేశ్ వర్సెస్ జీవితా రాజశేఖర్

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie Artists Association)ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ స్పష్టం చేయడమే కాకుండా..ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో(MAA Elections 2021) ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. ఇప్పటి వరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేశ్ యూ టర్న్ తీసుకోవడంతో మా ఎన్నికలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. జీవితా రాజశేఖర్‌కు(Jeevitha Rajasekhar) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమైనట్టు తెలుస్తోంది. జీవితా రాజశేఖర్‌కు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి..తానేంటో చూపిస్తానంటున్నాడు బండ్ల గణేశ్. 

అటు బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు. బండ్ల గణేశ్‌తో(Bandla Ganesh) తనకెలాంటి విభేదాలు లేవని తెలిపారు. మా లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా సరే..ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా మా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బండ్ల గణేశ్ కూడా మా అభివృద్ధికే పోటి చేస్తున్నట్టుగా భావిస్తున్నానన్నారు. తనకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నట్టు బావించడం లేదంటూ జీవితా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు బండ్ల గణేశ్ చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో(Tollywood) ప్రస్తుతం ఎక్కడ విన్నా మా ఎన్నికల చర్చే నడుస్తోంది. 

Also read: Tuck Jagadish Movie: టక్ జగదీష్ సినిమా ఓటీటీ విడుదల ఎందుకో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News