Disha Patani in Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు.. అందుకున్న ఈ చిత్రం వారాంతంలో కూడా అదే జోరు కనబరుస్తోంది. దీపిక పడుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో దిశా పటాని, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, మృణాల్ ఠాకూర్.. వంటి నటీనటులు కామియో పాత్రలలో కనిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. నిజానికి హీరోయిన్ గా మారింది తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా.. వచ్చిన లోఫర్ సినిమాతో. ఆ సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్.. వద్ద డిజాస్టర్ గా మారడంతో తర్వాత ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు రాలేదు. 


ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని మంచి హిట్ సినిమాలలో.. నటించిన దిశా పటాని.. మళ్లీ కల్కి 2898 ఏడి.. సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో.. అయినా మళ్లీ తెలుగులో ఆఫర్లు వస్తాయని..ఆమె ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. 


కానీ సినిమా విడుదలయ్యాక.. మాత్రం సీన్ రివర్స్ అయింది. సినిమాలో మిగతా క్యామియో పాత్రలలో.. కనిపించిన నటీనటులకు మంచి పేరు వచ్చింది.. కానీ దిశా పటాని.. క్యారెక్టర్ మాత్రం పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. 


ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈమె పాత్ర తో ప్రభాస్ కి ఒక పాట కూడా ఉంటుంది. మొదటిసారిగా ప్రభాస్ ని కాంప్లెక్స్ కి తీసుకు వెళ్ళేది దిశ పటాని. కానీ కథలో ఆమె పాత్రకి.. అంత పెద్ద వాల్యూ ఉండదు. ఆమె సన్నివేశాలు కట్ చేసేస్తే సినిమా నిడివి తగ్గి ఉండేది.. అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేశారు. 


ఈ రకంగా దిశా పటాని.. ఈ సినిమా వల్ల వచ్చిన ప్రయోజనం ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ సినిమా కారణంగా.. ఈమెకు తెలుగు ఆఫర్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకరకంగా ఎంత ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా..అయినప్పటికీ విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఈ సినిమా దిశా పటాని.. కెరియర్ కి ఏ మాత్రం.  మార్పు ఉండదని చెప్పుకోవచ్చు. దీంతో ఎంతో విజయం సాధించిన ఈ చిత్రం ఈ హీరోయిన్ కెరియర్ కి.. మాత్రం పనికిరాకుండా పోయింది.


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి


Also Read: Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి