Republic Movie Dispute: ఆ సన్నివేశాలు తొలగించకపోతే..కోర్టుకు వెళ్తాం
Republic Movie Dispute: వివాదం లేకుండా ఇటీవలి కాలంలో సినిమాలు ఉండటం లేదంటే అతిశయోక్తి లేదు. విడుదలవతున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది. తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాపై వివాదం నెలకొంది.
Republic Movie Dispute: వివాదం లేకుండా ఇటీవలి కాలంలో సినిమాలు ఉండటం లేదంటే అతిశయోక్తి లేదు. విడుదలవతున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది. తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాపై వివాదం నెలకొంది.
టాలీవుడ్(Tollywood)సినిమాలు గత కొద్దికాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. విడుదలైన లేదా విడుదల కానున్న సినిమాల్లో ఏదో ఒక అంశం కాంట్రవర్శీకు దారి తీస్తోంది. ఇటీవల విడుదలైన ఉప్పెన, కొండపొలం, దేవకట్ట సినిమాలతో పాటు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సినిమాలు వివాదాస్పదమయ్యాయి. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాపై ఏపీలోని కొల్లేరు సరస్సు ప్రాంతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ సినిమాలో సన్నివేశాలు తమ మనోభావాల్ని కించపర్చేలా ఉన్నాయనేది కొల్లేరు వాసుల ఆరోపణ. రిపబ్లిక్ సినిమాలోని(Republic Movie)సన్నివేశాలు తమ జీవనోపాధిని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని..వెంటనే ఆ సన్నివేశాల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు.
తామంతా కొల్లేరుపై(Kolleru Lake) ఆధారపడి జీవిస్తుంటే..వాస్తవ పరిస్థితులకు విరుద్ధం సినిమా తీశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్టుగా చూపించారని..ఫలితంగా తమ జీవనోపాధి దెబ్బ తింటుందని మండిపడ్డారు. సినిమా యూనిట్‌పై జిల్లా కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. సినిమా యూనిట్ వెంటనే స్పందించి..కొల్లేరుపై చిత్రీకరించిన సన్నివేశాల్ని తొలగించాలని..లేనిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్(Saidharam Tej)..పంజా అభిరామ్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటించగా..హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటించింది. రమ్యకృష్ణ, జగపతిబాబులు కీలకపాత్రలో కన్పిస్తారు.
Also read: Samantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook