Samantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం

Samantha: టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై వెళ్లిపోతుందని వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. తెలుగు అభిమానులకు అందుబాటులో ఉండనుందనే అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2021, 09:05 AM IST
  • టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత అభిమానులకు గుడ్‌న్యూస్
  • సమంత ఇకపై హైదరాబాద్‌లోనే నివాసం ఉండనుందనే సమాచారం
  • గచ్చిబౌలి ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతోందంటూ వార్తలు
Samantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం

Samantha: టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై వెళ్లిపోతుందని వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. తెలుగు అభిమానులకు అందుబాటులో ఉండనుందనే అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌లు రెండున్నాయి ఇప్పుడు. ఒకటి మా ఎన్నికలైతే రెండవది టాలీవుడ్(Tollywood) క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంతల విడాకుల అంశం. అక్కినేని నాగ చైతన్య-స్టార్ హీరోయిన్ సమంతలు నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి అప్పుడే నాలుగు రోజులవుతోంది. సమంత ముంబైలో ఇళ్లు కొనుగోలు చేసిందని..అక్కడి షిఫ్ట్ కానుందనే వార్తలు నాగ చైతన్య-సమంతల(Nag Chaitanya-Samantha Divorce)విడాకులకు ముందు నుంచే ప్రచారంలో ఉంది. విడాకుల ప్రకటన తరువాత ఇక ఆ వార్త నిజమేనని, ముంబై కచ్చితంగా వెళ్లిపోతుందని అంతా భావించారు. ముఖ్యంగా సమంత అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. 

ఇప్పుడీ వార్తల్ని ఖండిస్తూ, సమంత(Samantha Fans)అభిమానులకు ఊరటనిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత ఇకపై తెలుగు అభిమానులకు అందుబాటులో..హైదరాబాద్‌లోనే ఉండనుందనది ఆ వార్త సారాంశం. అందుకే అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్‌కు సమంత షిఫ్ట్ కానుందని తెలుస్తోంది. ముంబై వెళ్తున్నాననే వార్తల్ని కొట్టిపారేస్తూ..హైదరాబాద్‌లోనే ఉంటానని ఓ లైవ్ షోలో సమంత ఇటీవలే స్పష్టం చేసింది. అంతకుముందు కూడా హైదరాబాద్(Hyderabad)తనకు ఎంతో ఇచ్చిందని, ఇదే తన హోమ్ టౌన్..ఇప్పటికీ, ఎప్పటికీ అని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా గచ్చిబౌలి ఫ్లాట్‌లో(Samantha to shift in gachibowli flat)షిఫ్ట్ కానుందనే వార్తల నేపధ్యంలో అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇక సామ్ ఎక్కడికీ వెళ్లదని భావిస్తున్నారు. సమంత ఇప్పటికే శాకుంతల షూటింగ్ పూర్తి చేసుకోగా, కాతువాకుల రెండు కాదన్ అనే మరో మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం సమంత చెన్నైలో ఉంటోంది. 

Also read : Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్​కు పండగే...దసరా రోజున 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News