Jr NTR Watch Cost: సెలబ్రిటీలు ఏ పని చేసినా నెట్టింట వెంటనే వైరల్ అయిపోతుంది. బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్‌(Jr NTR) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారనే విషయం మన అందరికీ తెలిసిందే.  తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై సోషల్ మీడియా(Social Media)లో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ పెట్టుకున్న వాచ్ ధర(Jr NTR Watch Cost) తెలిస్తే మీరు షాక్ అవుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్


గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్‌(RRR Movie Promotions)లో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో అతడు ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్‌ చేస్తే.. దిమ్మతిరిగిపోయింది. ఆ వాచ్‌ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) అని తెలిసి ఆశ్చర్యపోయారు.  


ఈ వాచ్ ప్రత్యేకత ..
రిచర్డ్ మిల్లే ఆర్ఎమ్ కు చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ అది(Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition). ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఎన్టీఆర్‌ ఇష్టంతో ఈ వాచ్‌ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నట్లు సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook