Bollywood: అక్షయ్ కుమార్ సంపాదన తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం

Bollywood: బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడు అక్షయ్ కుమార్. విలక్షణ పాత్రల్లోనే కాదు..సంపాదనలో కూడా అగ్రస్థానమే. ఆరేళ్ల కాలంలో అక్షయ్ సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Bollywood: బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడు అక్షయ్ కుమార్. విలక్షణ పాత్రల్లోనే కాదు..సంపాదనలో కూడా అగ్రస్థానమే. ఆరేళ్ల కాలంలో అక్షయ్ సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బాలీవుడ్ ( Bollywood ) స్టార్ హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ( Akshay kumar )..సంపాదన పరంగా టాప్‌లో ఉన్నాడు. నటనలో అగ్రగణ్యులుగా చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు గానీ సంపాదన మాత్రం అందరికీ సాధ్యం కాదు. కానీ అక్షయ్ అలా కాదు..నటనతో పాటు సంపాదన కూడా ఎక్కువే. ఆరేళ్లకాలంలో అక్షయ్ సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు. అమెరికన్ మేగజైన్ ఫోర్బ్స్ ( Forbes magazine ) ప్రకారం గత ఆరేళ్లలో అక్షయ్ కుమార్ 17 వందల 44 కోట్లు సంపాదించాడు. కరోనా మహమ్మారి ( Corona pandemic ) సమయంలో సైతం అతడి సంపాదన ఆగలేదు.
ఈ యేడాది అంటే 2020లో 356 కోట్లు కాగా, 2019లో 459 కోట్లు, 2018లో 40.5 కోట్లు, 2017లో 35.5 కోట్లు, 2016లో 32.5 కోట్లుగా అక్షయ్ కుమార్ సంపాదన ఉంది. అటు రెమ్యునరేషన్ ఇటు బాక్సాఫీసు వద్ద సినిమా షేర్లు విషయంలో అక్షయ్ కుమార్ అగ్రస్థానంలో నిలిచాడు.
Also read: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్