Varun Doctor Movie OTT: తమిళ హీరో శివ కార్తికేయన్​ (Siva Karthikeyan New Movie), ప్రియాంక అరుల్​ మోహన్​ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుణ్​ డాక్టర్​' (Varun Doctor Movie News). నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వంలో దసరా పండగ సందర్భంగా అక్టోబరు 9న విడుదల అయ్యింది. థియేటర్లలో విపరీతమైన క్రేజ్​ లభించింది. ఇప్పుడా సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబరు 4న సాయంత్రం 6.30 గంటలకు సన్‌ టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్ట్స్‌ ఓటీటీల (Varun Doctor OTT Release) వేదికగా 'వరుణ్ డాక్టర్‌' స్ట్రీమింగ్‌ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క‌థేంటంటే? 


వ‌రుణ్ (శివ కార్తికేయ‌న్‌) ఓ ఆర్మీ డాక్టర్‌. పెళ్లిచూపుల్లో ప‌ద్మిని (ప్రియాంక అరుళ్ మోహ‌న్‌)ని చూసి ఇష్టప‌డ‌తాడు. ఆమెతో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధప‌డుతున్న స‌మ‌యంలోనే.. కొన్ని కార‌ణాల‌ వ‌ల్ల ఇద్దరూ విడిపోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో అనుకోకుండా ప‌ద్మిని చెల్లెలు కిడ్నాప్ అవుతుంది. దీంతో ఆ పాపను వెతికి ప‌ట్టుకునే బాధ్యత‌ను వ‌రుణ్ త‌న భుజాల‌కు ఎత్తుకుంటాడు. ఆ పిల్ల కోసం వెతుకుతున్న క్రమంలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి. ఆ పాప‌లాగానే గ‌త‌ నాలుగేళ్లలో 400 మంది వ‌ర‌కూ పిల్లలు కిడ్నాప్ అయ్యార‌ని తెలుస్తుంది. ఈ భారీ కిడ్నాప్ రాకెట్ వెనుకున్న ఆ అరాచ‌క శ‌క్తి ఎవ‌రు? ఆ దుర్మార్గుడ్ని వ‌రుణ్ ఎలా ప‌ట్టుకుంటాడు? ఈ క్రమంలో అత‌నికి ఎదురైన స‌వాళ్లేంటి? క‌నిపించ‌కుండా పోయిన ఆ పిల్లలంద‌రూ క్షేమంగా తిరిగొస్తారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శివ కార్తికేయన్‌ నటనతో పాటు, యోగిబాబు కామెడీ హైలైట్‌గా నిలిచింది.


Also Read: Ranbir Alia Wedding: డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్న రణ్​బీర్​ - అలియా? 


Also Read: RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.