RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు?

RRR Movie Teaser: డైరెక్టర్​ రాజమౌళి ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్​ డేట్​ దగ్గర పడనుండడం వల్ల ప్రమోషన్స్​ను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్లాన్​ చేస్తుంది. చిత్ర టీజర్​ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 11:50 AM IST
    • ప్రమోషన్స్​ స్టార్ట్​ చేసే ప్లాన్​లో 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం
    • అక్టోబరు 29న టీజర్​ రిలీజ్​ అప్​డేట్​ ఇచ్చే అవకాశం​
    • జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు?

RRR Movie Teaser Release Date: 'బాహుబలి' సిరీస్​ తర్వాత అతంటి భారీ బడ్జెట్​తో డైరెక్టర్​ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల (RRR Movie Release Date) కానుంది. రిలీజ్​ డేట్​ దగ్గర పడనుండడంతో సినిమా ప్రమోషన్స్​ను (RRR Movie Promo) ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. 

ఈ సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్' టీజర్​ (RRR Movie Teaser) రిలీజ్​ అప్​డేట్​ను అక్టోబరు 29న ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయమై సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 'ఆర్ఆర్​ఆర్​' సినిమా నుంచి ఇటీవలే రిలీజ్​ అయిన 'దోస్తీ' లిరికల్​ సాంగ్​తో పాటు 'రోర్​ ఆఫ్​ ఆర్ఆర్ఆర్​' మేకింగ్​ వీడియాకు (Roar of RRR Making Video) ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్​ లభించింది. 

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ (Ram charan RRR New Look), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల (RRR Release Date) కానుందీ చిత్రం.

Also Read: Puri Jagannadh News: ముంబై రోడ్లపై దర్శకుడు పూరీ జగన్నాథ్​కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే?

Also Read: Varudu Kaavalenu Movie Promotions: 'వరుడు కావలెను' మూవీ ప్రమోషన్స్​.. ఇలా కూడా చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News