Double Ismart Closing Box Collections:  రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ లీడ్ రోల్లో నటించిన సినిమా  ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో  తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 5 ఇయర్స్ బ్యాక్ పూరీ జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. అయితే.. అప్పట్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రూ. 40 కోట్ల షేర్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమాకు  సీక్వెల్ గా 5 యేళ్ల తర్వాత ఆడియన్స్ తీర్పు కోరుతూ వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల బడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్ తో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు మాత్రం రెండో ఆట నుంచే పూర్తిగా పడిపోయాయి.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ఎపుడూ ముగిసింది. ఈ సినిమా  బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..


నైజాం (తెలంగాణ).. రూ. 4.01 కోట్ల షేర్  
సీడెడ్ (రాయలసీమ).. రూ. 1.45 కోట్లు షేర్
ఆంధ్ర ప్రదేశ్.. రూ.4.29 కోట్ల షేర్
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.75 కోట్లు షేర్ (రూ. 15.40 కోట్ల గ్రాస్)
హిందీ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి.. రూ. 1.00 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 0.80 కోట్లు
మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.55 కోట్ల షేర్ (19.40 కోట్ల గ్రాస్)


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగి మొత్తంగా రూ. 37.45 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. మొత్తంగా నిర్మాతగా పూరీ జగన్నాథ్ కు థియేట్రికల్ గా రూ. 40 కోట్ల వరకు  నష్టాలను తీసుకొచ్చింది.  మొత్తంగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎపిక్  డబుల్ డిజాస్టర్ గ నిలిచింది. మొత్తంగా రామ్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద రాడ్ రంబోలా చిత్రంగా నిలిచింది.  మొత్తంగా రామ్ పోతినేనితో పూరీ జగన్నాథ్.. డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ కథ కాకుండా.. తన సినిమానే  తానే రీమేక్ చేసాడనే కామెంట్స్ ప్రేక్షకులను నుంచి వినబడ్డాయి. మొత్తంగా రామ్, పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. మొత్తంగా ప్రేక్షకుల ఆలోచనలను  తక్కువ అంచనా వేసిన పూరీ జగన్నాథ్ కు మొత్తంగా  కర్రు కాల్చి వాత  పెట్టారనే చెప్పాలి. ఏది ఏమైనా.. ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ హంగామా చేసిన పూరీ జగన్నాథ్, రామ్ కెరీర్ లో ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter